ఏపీ సర్కార్: భూములు ఉన్నవారికి గుడ్ న్యూస్.. త్వరలోనే కీలక నిర్ణయం..!
గత ప్రభుత్వ హయాంలో 2019లో పట్టణ గ్రామీణ ప్రాంతాలలో 10 నుంచి 20% వరకు భూముల వ్యాల్యూని సైతం పెంచారని.. 2022లో జిల్లా కేంద్రంలో 20% పెంచారని 2023లో జాతీయ రహదారులకు దగ్గరలో ఉన్న భూములతో పాటు పలు రకాల ప్రదేశాలలో 20 శాతం మాత్రమే భూమిలో పెంచారని. తెలిపారు. మరొకవైపు మార్కెట్ విలువ కంటే ప్రభుత్వ విలువ చాలా ఎక్కువ పెంచేశారని వీటిని అమ్ముకునేందుకు సైతం భూ యజమానులు ప్రయత్నించిన ఎవరు కొనడం లేదనే విధంగా ఇబ్బందులు తలెత్యాయని భూ యాజమాన్యులు ఫిర్యాదు చేస్తున్నారని.. దీనివల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుందని ఆలోచించిన తర్వాత రిజిస్ట్రేషన్ వేల్యూ ని సరిదిద్దాలని ప్రయత్నంగానే చేస్తున్నామంటూ తెలిపారు చంద్రబాబు.
అలాగే గత ప్రభుత్వ హయాంలో తీసుకువచ్చిన కొన్ని విధానాలు సంస్కరణలను సైతం మార్పులు చేసే విధంగా కూటమి ప్రభుత్వం ఆలోచిస్తుందట. ప్రస్తుతం ఉన్న సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలను యధావిధిగా ఉంచుతామని అవసరమైన చోట మాత్రమే మౌలిక సదుపాయాలను పెంచుతామంటూ తెలిపారు. గ్రామ సచివాలయాలలోనే రిజిస్ట్రేషన్ కు పెద్దగా రెస్పాన్స్ రాలేదని వీటివల్ల అదనంగా కూడా ఖర్చు అవుతుందని అధికారులు సీఎం కి పూర్తిగా వివరించడంతో వీటిని రద్దు చేయాలని ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. అదనపు ఖర్చు లేకుండా భూములు పెంచడానికి సీఎం ప్రతిపాదన తీసుకువచ్చినట్లు తెలుస్తోంది.