కిలారి రోశయ్య రాజీనామాతో వైసీపీ బండారం బట్టబయలు.. పార్టీ పరిస్థితి ఇంత ఘోరమా?

Reddy P Rajasekhar
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 ఎన్నికల్లో వైసీపీ సాధించిన ఫలితాల గురించి ఎంతో చర్చ జరిగింది. జగన్ మరీ దారుణంగా పరిపాలన సాగించి ఉంటే తప్ప ఇంత దారుణమైన ఫలితాలు వచ్చేవి కాదని చాలామంది భావించారు. సంక్షేమాన్ని నమ్ముకుని అభివృద్ధిని విస్మరిస్తే ఏం జరుగుతుందో ఈ ఎన్నికల ఫలితాలు చెప్పకనే చెప్పేశాయని చెప్పవచ్చు. పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య ఈ ఎన్నికల్లో గుంటూరు ఎంపీగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు.
 
ఎన్నికల ఫలితాలు వెలువడిన కొన్ని రోజులకే కిలారి రోశయ్య పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. రాజీనామా చేసిన తర్వాత ఆయన వైసీపీ బండారం బట్టబయలు చేశారు. వైసీపీ పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో ఆయన తన కామెంట్లతో చెప్పకనే చెప్పేశారు. కొందరు వ్యక్తుల చేతుల్లోనే వైసీపీ నడుస్తోందని ఆయన చెప్పుకొచ్చారు. పార్టీలో ఎంత కష్టపడినా కష్టపడిన వాళ్లకు మాత్రం అస్సలు గుర్తింపు ఉండదని ఆయన తెలిపారు.
 
కొంతమంది నన్ను మానసికంగా కుంగదీశారని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల తర్వాత వారి ఇష్టాలతోనే పార్టీని నడుపుతున్నారని కిలారి రోశయ్య అన్నారు. వైసీపీలో నేను కొనసాగలేనని ఆయన పేర్కొన్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులకు డబ్బులు ఇవ్వడం జరిగిందని కాపు అభ్యర్థులకు మాత్రం ఇవ్వలేదని ఆయన అన్నారు.
 
వైసీపీలో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నానని కిలారి రోశయ్య వెల్లడించారు. ఎంత కష్టపడినా కనీసం విలువ లేకుండా మాట్లాడుతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. ఆత్మాభిమానం దెబ్బతిన్న చోట తాను ఉండలేనని ఆయన పేర్కొన్నారు. కిలారి రోశయ్య రాజీనామాతో అయినా వైసీపీలో పరిస్థితి మారిందా అంటే లేదనే చెప్పాలి. వైసీపీ నేతల్లో మార్పు రాకపోతే మాత్రం భవిష్యత్తులో కూడా ఆ పార్టీకి ఇబ్బందేనని చెప్పవచ్చు. జగన్ రాబోయే రోజుల్లో పార్టీ పుంజుకునే దిశగా అడుగులు వేస్తారేమో చూడాల్సి ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జగన్ కెరీర్ పరంగా తప్పటడుగులు పడకుండా అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: