ఏపీలో బలోపేతం అవుతున్న జనసేన.. భవిష్యత్తు కార్యాచరణ అలా ఉండనుందా?
జనసేన పార్టీలో సభ్యత్వాన్ని తీసుకునే వాళ్ల సంఖ్య సైతం అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. 2029 ఎన్నికల్లో కూడా టీడీపీ జనసేన స్నేహం కొనసాగే అవకాశం ఉంది. అయితే జనసేన ఎక్కువ సంఖ్యలో స్థానాల్లో పోటీ చేసే ఛాన్స్ అయితే ఉంది. ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో పవర్ షేరింగ్ కూడా కోరుకునే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.
జనసేన పార్టీ రాష్ట్రంలో అంతకంతకూ పుంజుకుంటూ ఉండటంతో ఫ్యాన్స్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. పవన్ కళ్యాణ్ ఈ ఏడాదే సినిమాలకు సంబంధించిన షూటింగ్ లో పాల్గొనే అవకాశం కూడా ఉంది. పవన్ మూడు సినిమాలు మూడు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలుస్తాయని ఫ్యాన్స్ భావిస్తుండటం గమనార్హం. ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఇప్పటికే 20 శాతం షూట్ పూర్తైందని తెలుస్తోంది.
పవన్ కళ్యాణ్ సినిమాలు అంతకంతకూ వాయిదా పడటం వల్ల నిర్మాతలపై ఆర్థికంగా భారం పెరుగుతోందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. పవన్ కళ్యాణ్ ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త సినిమాలను మాత్రం ప్రకటించే అవకాశం లేదు. హరిహర వీరమల్లు రెండు భాగాలుగా తెరకెక్కనుందని ప్రచారం జరుగుతున్నా ఫస్ట్ పార్ట్ రిజల్ట్ ఆధారంగా సెకండ్ పార్ట్ ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ రేంజ్ పాన్ ఇండియా స్థాయిలో ఊహించని స్థాయిలో పెరిగింది. పవన్ భవిష్యత్తు సినిమాలన్నీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్నాయి.