చిరంజీవికి లైఫ్ ఇచ్చిన సుధాకర్.. ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసా..?
తమిళనాడులో హీరోగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించిన సుధాకర్. ఈయనని కొంతమంది నేతలు అప్పట్లోనే పార్టీ ప్రచారానికి కూడా పిలిపించుకునే వారట. దీంతో సుధాకర్ రేంజ్ ఎలా ఉండేదో చెప్పాల్సిన పని లేదు. అయితే ఆ సమయంలో సుధాకర్ ని చాలా మంది తొక్కేసారని విషయం మాత్రం తమిళ ఇండస్ట్రీలో వినిపిస్తుంది. దీనివల్లే తమిళ ఇండస్ట్రీని వదిలేసి పూర్తిగా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి వచ్చి ఇక్కడ కమెడియన్గా మారిపోయారని సమాచారం. ఈయన తండ్రి కూడా గవర్నమెంట్ ఉద్యోగి కావడం చేత పలు రకాల ప్రాంతాలలో చదువుకున్నారట.
మద్రాసులో సినిమాలలోకి ఎంట్రీ ఇవ్వడానికి శిక్షణ తీసుకుంటున్న సమయంలో చిరంజీవి, సుధాకర్ ఇద్దరు కూడా ఒకే రూమ్ లో ఉండేవారట. సుధాకర్ కు పునాదిరాళ్లు సినిమాలో అవకాశం రావడంతో ఈ చిత్రాన్ని భారతి రాజ దర్శకత్వం వహిస్తూ ఉండగా.. ఈ చిత్రంలో తనని కూడా ఒక సన్నివేశం ఇవ్వమని చిరంజీవి కోసం సుధాకర్ డైరెక్టర్ భారతి రాజును కూడా అడిగారట. అలా చిరంజీవి కూడా పునాదిరాళ్ల సినిమాలో నటించారు. అలా చిరంజీవి సినీ కెరియర్ కి సుధాకర్ సహాయపడ్డారు. అందుకే సుధాకర్ అంటే చిరంజీవికి చాలా అభిమానం అని ఎన్నో సందర్భాలలో చెప్పారట. అయితే తాజాగా సుధాకర్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొనగా తనని చూసి గుర్తుపట్టడం చాలా కష్టంగా మారిపోయింది. వయసు మీద పడుతున్నట్టు చాలా క్లియర్ గా కనిపిస్తోంది. ఈ ఫోటోలు చూసినా అభిమానుల సైతం ఆశ్చర్యపోతూ కామెంట్స్ చేస్తున్నారు.