రివేంజ్ పాలిటిక్స్ : జగన్ vs చంద్రబాబు యుద్ధం.. రాష్ట్రం రావణ కాష్టం?
అయితే 2019లో 151 స్థానాలలో విజయం సాధించి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏపీలో అధికారాన్ని చేపట్టింది. దీంతో అంతకు ముందు ఆ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో అధికారంలో ఉన్న టిడిపి ప్రభుత్వం తమను ఎలా అయితే ఇబ్బందులకు గురి చేసిందో.. అదంతా మనసులో పెట్టుకున్న జగన్.. ఊహించని రీతిలో రివేంజ్ తీర్చుకున్నాడు. ఏకంగా చంద్రబాబును జైలుకు పంపించాడు. అసెంబ్లీలో దారుణంగా అవమానించాడు. ఈ కక్ష సాధింపు రాజకీయాలు చూసి ప్రజలు విసిగిపోయారు. దీంతో ఇక 2024 అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి జనసేన బిజెపి పార్టీల కూటమికి 161 స్థానాలు కట్టబెట్టారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ కక్ష సాధింపులు తగ్గుతాయి అని అందరూ అనుకున్నారు. అనుకున్నట్లుగానే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు కక్ష సాదింపులకు పాల్పడవద్దని.. ఇక ప్రజలు అధికారాన్ని ఇచ్చారు కదా అని నెత్తికి ఎక్కించుకుని ఇస్టారీతిన ప్రవర్తిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అయితే ఈ మాటలతో పరిస్థితులు బాగుపడతాయి అనే నమ్మకం అందరిలో వచ్చింది. అయితే ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే అవన్నీ కేవలం మాటలకు మాత్రమే పరిమితం అయ్యాయి అన్నది అర్థమవుతుంది. ప్రభుత్వం మారక పరిస్థితులు మారుతాయి.. రివేంజ్ రాజకీయాలకు చరమగీతం పాడుతారు అనుకుంటే ఇక ఇప్పుడు అవే కక్ష సాధింపు రాజకీయాలు ఏపీలో మరింత ఎక్కువయ్యాయి. కార్యకర్తల హత్యలు ప్రతిపక్ష పార్టీల నేతలపై దాడులు.. వైసిపి ఆఫీసులను ధ్వంసం చేయడం ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కటేమిటి ఎన్ని రకాలుగా రివెంజ్ తీర్చుకోవాలో.. అన్ని రకాలుగా ముందుకు సాగుతూనే అధికార పార్టీ. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలు చూస్తున్న ప్రజలు జగన్, చంద్రబాబు ఇలా ఎవరు వచ్చినా ఈ కక్ష సాధింపు రాజకీయాలు మాత్రం ఆగేలా లేవని.. పరిస్థితులు ఇలాగే కొనసాగితే రాష్ట్రం రావణకాష్టంలా మారిపోతుందని ఆందోళన చెందుతున్నారు.