జగన్ నయా ప్లాన్..ఆ ఎంపీలను అమ్మేస్తున్నారా.?

frame జగన్ నయా ప్లాన్..ఆ ఎంపీలను అమ్మేస్తున్నారా.?

Pandrala Sravanthi
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అంతేకాకుండా చంద్రబాబు సీఎం అయిన తర్వాత కేవలం ఏపీలోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా కీలక లీడర్ గా మారారు. ఎన్డీఏ ప్రభుత్వంలో  ఈయన భాగస్వామ్యంతోనే  ప్రధాని మోడీ మరోసారి పీఎం అయ్యారు. దేశ రాజకీయాల్లో కూడా కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు నెక్స్ట్ టార్గెట్ జగన్ ను ఐదు సంవత్సరాల్లో పూర్తిగా లేకుండా చేయాలని ఆలోచనతో ఉన్నారు. దీంతో ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు చేసినటువంటి తప్పులు మరియు తన కేసులకు సంబంధించిన విషయాలను బయటపెట్టే పనిలో నిమగ్నమయ్యారు. ఇదే తరుణంలో  ఒక సరికొత్త ప్లాన్ చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

  కొన్ని రోజుల నుంచి వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో రెండుసార్లు భేటీ అయ్యారు. అంతేకాదు ఆ ఫోటోలను కూడా సోషల్ మీడియాలో మెయిన్ మీడియాలో విడుదల చేశారు.  ఇంత హఠాత్తుగా వీరు అమిత్ షాతో ఎందుకు ఫోటోలు దిగారు ఢిల్లీకి ఎందుకు వెళ్లారు అనేది కూడా చాలా ఆసక్తికరంగా మారింది. వైసీపీ రాజ్యసభ సభ్యులు  రాజీనామా చేసి మళ్లీ  టిడిపిలో చేరి ఆ పార్టీ నుంచి పోటీ చేస్తారని  సాక్షి ఛానల్ లో విపరీతంగా వార్తలు వస్తున్నాయి. ఇది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉద్దేశపూర్వకంగానే ప్రచారం చేయిస్తుందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది అంటున్నారు.  దీనికి ప్రధాన కారణం ఆ ఎంపీలను బిజెపిలోకి పంపి జగన్ తన వ్యూహాన్ని ప్రారంభించబోతున్నట్టు తెలుస్తోంది.

 ఈ విధంగా ఆరుగురు ఎంపీలను బిజెపికి సపోర్ట్ చేయించి ఆ తర్వాత  బిజెపి పెద్దలతో కలిసి తనకు సంబంధించిన కేసుల విషయంలో న్యాయం చేయమని కోరుతారట. అంతేకాకుండా వివేకానంద రెడ్డి హత్య కేసులో కూడా స్టేటస్ కో ఉండేలా చూడాలని అడుగుతారట.  అయితే ఆయనపై ఉన్న కేసులు ముందుకు వెళ్లకుండా సైలెంట్ గా ఉండేందుకు జగన్  తన పార్టీ ఎంపీలను బిజెపి వద్ద బలి చేస్తున్నారని తెలుస్తోంది. దీనిపై బీజేపీ అధిష్టానం ఎలాంటి స్పష్టత ఇస్తుంది అనేది  క్లారిటీ రాలేదు. ఇప్పటికే ఢిల్లీలో ధర్నా చేసి ఇండియా కూటమి నేతలను పిలిపించుకున్న జగన్  ఇలా బిజెపితో కలిస్తే వారు సహకరిస్తారా లేదా అనేది రాబోవు రోజుల్లో తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: