వైసిపి పార్టీ మాజీ ఎమ్మెల్యే వల్లభ నేని వంశీ పరారీలో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. గన్నవరం లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం పై... జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దాడి జరిగింది. అయితే ఈ కేసు ఇప్పుడు తెరపైకి వచ్చి... వైసిపి నేతలకు చుక్కలు చూపిస్తోంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యాలయం పై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకుంటున్నారు.
ఇందులో భాగంగానే వల్లభ నేని వంశీ పై కూడా కేసు నమోదు అయింది. ఈ సంఘటనలో ఇప్పటివరకు 19 మందిని అరెస్టు చేశారు ఏపీ పోలీసులు. అంతేకాకుండా తాజాగా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రధాన అనుచరులు కూడా అరెస్ట్ అయ్యారట. వల్లభనేని వంశీ అనుచరులు అయినా రమేష్ అలాగే యూ సఫ్ పటాన్ లు కూడా ఏపీ పోలీసుల అదుపులో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇక ఈ కేసులో కీలకంగా ఉన్న వల్లభనేని వంశీ పైన కేసు నమోదు చేసిన పోలీసులు... రూల్స్ ప్రకారం అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేయడం జరిగింది. అయితే తనను అరెస్టు చేస్తారని ముందే ఊహించిన వల్లభనేని వంశీ.. ఏపీ నుంచి బయటికి వెళ్లినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ వెళ్ళాడా లేదా దుబాయ్ వెళ్ళాడా? అనేది తెలియాల్సి ఉంది. కొంతమంది మాత్రం వల్లభనేని వంశీ హైదరాబాద్ వెళ్లినట్లు చెబుతున్నారు.
దీంతో రెండు రోజుల నుంచి హైదరాబాదులో వల్లభనేని వంశీ కోసం ఏపీ పోలీసులు తిరుగుతున్నారు. ఇప్పటివరకు వల్లభనేని వంశీ ఆచూకీ మాత్రం లభించలేదు. అయితే టాలీవుడ్ హీరో ఇంట్లో వల్లభ నేని వంశీ దాచుకున్నాడని తెలుస్తోంది. టాలీవుడ్ ప్రముఖ హీరో గెస్ట్ హౌస్ గచ్చిబౌలి ఏరియాలో ఉందట. అయితే అక్కడే గెస్ట్ హౌస్ లో ఉంటు న్నాడట వల్లభనేని వంశీ. అయితే దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.