ఏపీలో భూ రిజిస్ట్రేషన్ విలువల పెంపుపై సర్కార్ ఫోకస్.. ఆ ప్రాంతాల్లో పెరిగే ఛాన్స్!
ప్రభుత్వం మాత్రం నిర్ణయం తీసుకుంటే ప్రస్తుతం ఉన్న విలువతో పోల్చి చూస్తే 5 శాతం నుంచి 10 శాతం మధ్య పెరగనుందని భోగట్టా. పట్టణ ప్రాంతాలలో ప్రతి సంవత్సరం ఆగష్టు నెల 1వ తేదీన, గ్రామీణ ప్రాంతాలలో రెండేళ్లకు ఒకసారి రిజిస్ట్రేషన్ విలువలను పెంచుతున్నారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో రిజిస్ట్రేషన్ ఛార్జీలను భారీగా పెంచిన సంగతి తెలిసిందే.
రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచడం ద్వారా రాష్ట్ర ఆదాయం సైతం పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రత్యేక రివిజన్ పేరుతో ఏపీలో భూ రిజిస్ట్రేషన్ విలువల పెంపు దిశగా అడుగులు పడటం గమనార్హం. కొన్నిచోట్ల రిజిస్ట్రేషన్ విలువలు ఎక్కువగా ఉంటే మరికొన్ని చోట్ల బహిరంగ మార్కెట్ విలువలు తక్కువగా ఉండటం గమనార్హం. ఈ హెచ్చు తగ్గులపై కూడా ప్రస్తుతం సమీక్షలు జరుగుతున్నాయని తెలుస్తోంది.
శుక్రవారం రోజున జరిగే సమీక్షలో ఇందుకు సంబంధించి పూర్తిస్థాయిలో స్పష్టత వచ్చే అవకాశాలు ఉంటాయి. ఏపీ ప్రభుత్వం భూ రిజిస్ట్రేషన్ విలువల పెంపు దిశగా అడుగులు వేస్తే ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన రెండు నెలలకే రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచడం ఎంతవరకు కరెక్ట్ అని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఏపీలో చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఆదాయం పెంచుకునే దిశగా అడుగులు వేస్తున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ఏపీ ప్రభుత్వం పేదలకు, మధ్యతరగతి వర్గాల ప్రజలకు మంచి జరిగేలా అడుగులు వేస్తుండటం కొసమెరుపు.