పవన్ పై పగతో ఇండస్ట్రీకి చుక్కలు చూపించిన జగన్.. ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నారుగా!

Reddy P Rajasekhar
సాధారణంగా రాజకీయాలలో ఇతర పార్టీలకు అనుకూలంగా పని చేసిన వ్యక్తులపై అధికార పార్టీలోఉన్న వ్యక్తులకు సహజంగా కోపం ఉంటుంది. 2014లో వైసీపీ అధికారంలోకి రావాల్సి ఉన్నా పవన్ కళ్యాణ్ అప్పుడు టీడీపీకి మద్దతు ఇవ్వడంతో పవన్ అభిమానులు సైతం టీడీపీకి అనుకూలంగా పని చేయడం జరిగింది. అందువల్ల 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ టార్గెట్ గా జగన్ రాజకీయాలు చేశారు.
 
చాలా సందర్భాలలో పవన్ పెళ్లిళ్ల గురించి వ్యంగ్యంగా కామెంట్లు చేసిన జగన్ పవన్ ను ఆర్థికంగా దెబ్బ కొట్టాలనే ఆలోచనతో పవన్ సినిమాలు విడుదలైన సమయంలో టికెట్ రేట్లను తగ్గించడం గమనార్హం. వకీల్ సాబ్ సినిమా రిలీజ్ కు ముందు టికెట్ రేట్లను భారీగా తగ్గిస్తున్నట్టు ప్రకటనలు వెలువడ్డాయి. తగ్గించిన టికెట్ రేట్ల విషయంలో తీవ్రస్థాయిలో నెగిటివ్ కామెంట్లు సైతం వ్యక్తమయ్యాయి.
 
వకీల్ సాబ్ మూవీ ఏపీ హక్కులను కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు తగ్గించిన టికెట్ రేట్ల వల్ల దారుణంగా నష్టపోయారు. పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమా రిలీజైన కొన్ని రోజుల వరకు ఇవే టికెట్ రేట్లు కొనసాగాయి. పవన్ పై పగతో జగన్ ఇండస్ట్రీకి చుక్కలు చూపించగా ఇప్పుడు ఆయన ఫలితం అనుభవిస్తున్నారని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి
 
జగన్ 2024 ఎన్నికల్లో ఘోర ఫలితాలను సాధించడానికి తాను గెలిచినా పార్టీని గెలిపించుకోలేకపోవడానికి పవన్ విషయంలో జగన్ వ్యవహరించిన తీరే కారణమని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గేమ్ ఛేంజర్ అని చాలామంది భావిస్తారు. పవన్ కళ్యాణ్ తాను గెలిచి జనసేనను గెలిపించుకోవడంతో పాటు రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించారు. టీడీపీతో పవన్ పొత్తు పెట్టుకున్న ప్రతి సందర్భంలో ఆ పార్టీకి మేలు జరిగింది. భవిష్యత్తులో సైతం ఈ పొత్తులు కొనసాగే ఛాన్స్ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: