బాబు సూపర్ సిక్స్ డక్ అవుట్.. వైసీపీ మాజీ మంత్రి బుగ్గన పంచ్ లు భలే పేలాయిగా!
మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన ఒక్క పంచ్ తో సూపర్ సిక్స్ పథకాల అమలు రాష్ట్రంలో ఏ విధంగా ఉండనుందో చెప్పకనే చెప్పేశారు. చంద్రబాబు రిలీజ్ చేసిన పత్రం శ్వేత పత్రమా లేక సాకు పత్రమా అంటూ బుగ్గన కామెంట్లు చేశారు. బుగ్గన పార్టీ మారతారని గతంలో ప్రచారం జరిగినా ఆ ప్రచారాన్ని సైతం బుగ్గన ఖండించిన సంగతి తెలిసిందే. మొదటి ఓవర్ లోనే చంద్రబాబు డకౌట్ అయ్యారని బుగ్గన వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ కు 2,40,000 కోట్ల రూపాయల ఆదాయం ఉందని ఈ ఆర్థిక మంత్రి లెక్కలతో సహా వివరించారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, నిరుద్యోగ భృతి అమలు ఎప్పుడు చేస్తారని బుగ్గన ప్రశ్నించారు. బుగ్గన ప్రశ్నలకు టీడీపీ నేతలెవ్వరూ పెద్దగా రియాక్ట్ కాలేదు. బుగ్గన ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో పథకాల అమలుకు సంబంధించి ఎప్పుడూ పెద్దగా ఇబ్బందులు అయితే రాలేదు.
సూపర్ సిక్స్ హామీల అమలు ఆలస్యం అవుతుండటంపై ప్రజల్లో నెమ్మదిగా వ్యతిరేకత పెరుగుతుండగా ఈ వ్యతిరేకతను అధిగమించడానికి కూటమి నేతలు ఏం చేస్తారో చూడాల్సి ఉంది. సూపర్ సిక్స్ హామీల అమలు సాధ్యం కాకపోతే మాత్రం తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. త్వరలో సూపర్ సిక్స్ హామీల విధివిధానాలను ప్రకటిస్తామని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఏపీ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఈ హామీల అమలు సాధ్యమవుతుందో లేదో చూడాల్సి ఉంది.