ఏపీ సీఎం: గ్రామ, మండల స్థాయిలలో టోల్ వసూళ్ల.. సక్సెస్ అయ్యేనా..?

Divya
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రోడ్ల దుస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. వైసిపి హయాంలో కూడా వీటి మీద చాలా దారుణంగా ట్రోల్స్ కూడా జరిగాయి. ముఖ్యంగా సంక్షేమ పథకాలకు పెద్దపీట వేసిన వైసిపి రోడ్ల విషయంలో గాలికి వదిలేయడంతో చాలా బలంగా వైసీపీ పార్టీ మీద దెబ్బ పడింది. దీంతో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వీటిని బాగు చేయడానికి తాను శ్రీకారం చుట్టారు. ఆ సమయంలో ప్రభుత్వం కాస్త కదిలినట్టుగా అనిపించినప్పటికీ కానీ జరగాల్సిన డామేజ్ మొత్తం జరిగిపోయింది. ఎన్నికలు రానే వచ్చేసాయి ఆ ఎఫెక్ట్ మొత్తం వైసిపి పార్టీ మీద పడి దారుణంగా ఓటమిపాలయ్యింది.

అయితే ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన సమయంలో ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు కూటమినేతలు కూడా రోడ్లు బాగు చేసే విషయంలో సరికొత్త ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఏపీలో రోడ్ల పరిస్థితి సైతం పక్క రాష్ట్ర నేతలు కూడా కామెంట్స్ చేసే పరిస్థితి ఉన్న సమయంలో.. ఏపీలో మౌలిక సదుపాయాలు కూడా లేకపోవడంతో రోడ్డును బాగు చేసే విధానం పైన చంద్రబాబు సరికొత్త నిర్ణయం తీసుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

అదేమిటంటే గ్రామ, మండల స్థాయిలలో టోల్స్ ఏర్పాటు చేయబోతున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా గుంతలు పడిన రోడ్లను ఇప్పటికి ఇప్పటికే బాగు చేయడం చాలా కష్టమని అందువల్ల పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం విధానంలో రాష్ట్రంలోని రహదారులను సైతం బాగు చేయాలనే ఆలోచనతో ఇలాంటి నిర్ణయం ఏపీ ప్రభుత్వం తీసుకున్నట్లు సమాచారం. గ్రామ మండల స్థాయిలో టోల్ విధానం అమలు చేయాలని చూస్తున్నారట. అయితే ఇందులో నుంచి బైకులు, ఆటోలు, ట్రాక్టర్లు మినహాయింపు ఉండబోతోందట. మిగిలిన వాహనాలకు మాత్రం తోలు వసూలు చేయాలంటూ ఏపీ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.. ఇలా వచ్చిన ఆదాయాన్ని మొత్తం ఆర్ అండ్ బి డిపార్ట్మెంట్కు చేర్చేలా ప్లాన్ చేస్తున్నారట. మరి ఈ విషయాన్ని ప్రజలు ఏకీభవిస్తారా.. ముఖ్యంగా గ్రామ మండల స్థాయిలలో కూడా ఇలాంటి టోల్ పరిస్థితి వస్తే కచ్చితంగా ఒక్కసారి మొదలయ్యిందంటే ఇక ఆగేది ఏమీ ఉండదు.. దీంతో కచ్చితంగా ప్రజలు ఈ విషయాన్ని వ్యతిరేకిస్తారని కూడా పలువురు నేతలు తెలుపుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: