చంద్రబాబు బోటు విన్యాసాలు.. ప్రమాదంలో అమరావతి?

frame చంద్రబాబు బోటు విన్యాసాలు.. ప్రమాదంలో అమరావతి?

Veldandi Saikiran
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత వారం రోజుల నుంచి అత్యంత భారీ వర్షాలు పడుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ లోనే కాదు తెలంగాణలో కూడా ఈ వర్షాలు బీభత్సం సృష్టించాయి. భారీ వర్షాల నేపథ్యంలో విజయవాడ మహానగరం పూర్తిగా మునిగిపోయింది. విజయవాడ పైన ఉన్న బుడమేడు విజృంభించడంతో... దానికి గండ్లు కూడా పడ్డాయి. ఈ నేపథ్యంలో పైన కురిసిన వరద మొత్తం విజయవాడ నగరంలోకి వచ్చింది.
 

దీంతో విజయవాడ మహానగరంలో ఉన్న చాలావరకు మొత్తం మునిగిపోయింది.  పోలీస్ స్టేషన్, బస్టాండ్ అలాగే రైల్వేస్టేషన్లో అన్నిటిలోనూ... వరద నీరు వచ్చి చేరింది. చాలామంది.. విజయవాడ వాసులు వరద ముంపునకు గురయ్యారు. కోట్లల్లో  నష్టం త్వరగా చాలామంది మరణించారు. కొంతమంది మృతదేహాలు కూడా దొరకలేదు. అయితే ఇలాంటి నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం చాలా.. బాగా పని చేస్తోంది.
 70 ఏళ్ల వయసులో కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు... వరదల్లో పని చేస్తున్నారు. విజయవాడ వరద బాధితులను కాపాడుతున్నారు. మొన్న ఆదివారం రోజున చంద్రబాబు నాయుడు అసలు నిద్రపోలేదు. బోట్లలో... చంద్రబాబు నాయుడు ప్రయాణించి వరద బాధితులను ఆదుకునే ప్రయత్నం చేశారు. ఇంకా కూడా వరద బాధితులకు సహాయ సహకారాలు అందిస్తోంది చంద్రబాబు సర్కార్.
 అయితే విజయవాడలో వరదలు నెలకొన్న నేపథ్యంలో అమరావతి కూడా పూర్తిగా మునిగిపోయినట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఇల్లు కూడా మునిగిందని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. అయితే చంద్రబాబు నాయుడు బోట్లో ప్రయాణించడానికి ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నారు. అయితే అమరావతి పరిధిలోనే ఉన్న... విజయవాడ మునగడంతో... పెట్టుబడులు పెట్టేందుకు కొంతమంది భయపడుతున్నారట. విజయవాడ మునిగిన ప్పుడు అమరావతి కూడా..  భవిష్యత్తు లో ప్రమాదానికి గురయ్యా ఛాన్స్ ఉందని కూడా అంటున్నారు. మరి దీనిపై చంద్రబాబు నాయుడు పెట్టు బడి దారులకు ఎలాం టి భరోసా ఇస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: