తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో సంవత్సరాల పాటు స్టార్ హీరోయిన్గా కెరియర్ను కొనసాగించిన వారిలో విజయశాంతి ఒకరు. ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న దాదాపు అందరూ స్టార్ హీరోల సరసన నటించి ఎన్నో సంవత్సరాల పాటు తిరుగులేని నటిగా కెరియర్ను కొనసాగించింది. కెరియర్ ప్రారంభంలో కమర్షియల్ సినిమాలలో నటించిన ఈమె ఆ తర్వాత లేడీ ఓరియంటెడ్ సినిమాలలో నటించడం మొదలు పెట్టింది. అందులో భాగంగా ఈమె నటించిన అనేక లేడీ ఓరియంటెడ్ సినిమాలు అద్భుతమైన విజయాలు సాధించడంతో ఈమెకు హీరోల స్థాయి గుర్తింపు వచ్చింది.
దానితో ఈమె ఆ తర్వాత కమర్షియల్ సినిమాలలో కంటే లేడీ ఓరియంటెడ్ సినిమాలలో నటించడానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తూ వచ్చింది. సినిమాలలో అద్భుతమైన స్థాయిలో సక్సెస్ అయిన విజయశాంతి ఆ తర్వాత రాజకీయాలపై దృష్టి పెట్టింది. కానీ సినిమాల్లో సక్సెస్ అయినంత స్థాయిలో విజయశాంతి రాజకీయాల్లో మాత్రం సక్సెస్ కాలేదు. విజయశాంతి రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన కొత్తలో ఒక పార్టీని స్థాపించింది. ఆ పార్టీని టిఆర్ఎస్ లో విలీనం చేసి కొన్ని పరిణామాల క్రమంలో టిఆర్ఎస్ పార్టీ ఈమెను సస్పెండ్ కూడా చేసింది.
విజయశాంతి 1998 లో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. మొదట ఈమె భారతీయ జనతా పార్టీలో చేరింది. తెలంగాణ రాష్ట్ర సాధన లక్షంగా 2005 లో తల్లి తెలంగాణ అనే రాజకీయ పార్టీని స్థాపించింది. ఆమె అనంతరం ఆ పార్టీని 2009 లో తెలంగాణ రాష్ట్ర సమితిలో (టీఆర్ఎస్) లో విలీనం చేసి టీఆర్ఎస్ లో చేరింది. విజయశాంతి 2009 లో మెదక్ పార్లమెంట్ స్థానం నుండి తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థిగా పోటీ చేసి ఎంపీ గా గెలిచింది. ఈమె 2013 లో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్గొంటుందని ఆమెను టీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేశారు. విజయశాంతి 2014 లో కాంగ్రెస్ పార్టీలో చేరింది.
ఈమె 2014 లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యింది. ఆమె 2020 డిసెంబరు 07న భారతీయ జనతా పార్టీలో చేరి 2023 నవంబరు 15 న భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసింది. ఆ తర్వాత ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరింది. ఆ తర్వాత విజయశాంతి నీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ, ప్లానింగ్ కమిటీ చీఫ్ కోఆర్డినేటర్, కన్వీనర్‌గా నియమించారు. ఇలా విజయశాంతి రాజకీయ ప్రస్థానం లో టిఆర్ఎస్ పార్టీ నుండి ఒక సారి సస్పెండ్ అయ్యింది.