మాకు గంభీర్ లాంటి కోచ్ కావాలి.. పాక్ మాజీ కామెంట్స్?

praveen
గత కొంతకాలం నుంచి పాకిస్తాన్ క్రికెట్లో ఎంతలా గందరగోల పరిస్థితులు నెలకొన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు వరల్డ్ క్రికెట్లో ఛాంపియన్ టీం గా హవా నడిపించిన పాకిస్తాన్.. గత కొంతకాలం నుంచి మాత్రం చెత్త ప్రదర్శనలతో అందరిని ఆశ్చర్యపోయేలా చేస్తుంది. ఒకప్పుడు వరల్డ్ కప్ గెలిచి ఛాంపియన్ గా నిలిచిన పాకిస్తాన్ జట్టు ఇంత దారుణమైన ప్రదర్శన చేస్తుంది అని ఏకంగా క్రికెట్ విశేషకులు సైతం ఆ జట్టు ఆట తీరు చూసి ఆశ్చర్యం లో మునిగిపోతున్నారు.

 అయితే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వ్యవహారాలలో రాజకీయ జోక్యం ఇక జట్టులోని ఆటగాళ్ల మధ్య సఖ్యత లేకపోవడం.  ఇంకోవైపు కోచింగ్ సిబ్బంది సరిగా లేకపోవడం కారణంగానే పాకిస్తాన్ క్రికెట్ ఇలా వైభవాన్ని కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అని ఎంతోమంది క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గత కొంతకాలం నుంచి పాకిస్తాన్ జట్టుకు కెప్టెన్సీ వహించడం విషయంలో తరచూ మార్పులు జరుగుతూనే ఉన్నాయి. క్రికెట్ బోర్డు చైర్మన్ దగ్గర నుంచి కోచింగ్ సిబ్బంది వరకు కూడా అందరూ మారుతూనే ఉన్నారు. గతంలో వరల్డ్ కప్ లో నెదర్లాండ్స్ చేతిలో మొన్నటికి మొన్న సొంత గడ్డపైనే బంగ్లాదేశ్ చేతిలో ఘోర పరాజయాలను చవిచూసింది పాకిస్తాన్.

 ఇలా పాకిస్తాన్ వరుస వైఫల్యాల పై స్పందించిన ఆ దేశ మాజీ ఆటగాడు డానిష్ కనేరియా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ లాంటి వారు వస్తేనే పాకిస్తాన్ క్రికెట్ బాగుపడుతుంది అంటూ కనేరియా వ్యాఖ్యానించాడు. అలాంటి వారే తమ క్రికెట్ పతనాన్ని  అడ్డుకోగలరు  గంభీర్ ముక్కు సూటి మనిషి ఆయనకు వెన్నుపోటు పొడవడం తెలియదు. కోచ్ అంటే అలాగే ఉండాలి. పాకిస్తాన్ క్రికెట్లో ఎన్ని మార్పులు చేసినా లాభం లేకుండా పోతుంది. ఆటగాళ్లు లెక్కలేని తనంతో ఉన్నారు అంటూ డానిష్ కనేరియా కామెంట్ చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: