బ‌డ్జెట్ బెంగ‌ : బ‌డ్జెట్ స‌భ‌లా.. శ్వేత‌ప‌త్రాల స‌భ‌లా?

Pulgam Srinivas
కొంత కాలం క్రితం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ ఎన్నికలలో తెలుగుదేశం , జనసేన , బిజెపి మూడు పార్టీలు కలిసి పొత్తులో భాగంగా పోటీ చేశాయి. అప్పటివరకు అధికారంలో ఉన్న వైసిపి ఎవరితో పొత్తు లేకుండా ఒంటరిగా పోటీలోకి దిగింది. ఈ ఎన్నికలలో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత రావడమో లేక కూటమి వైపు ప్రజలు ఎక్కువ మొగ్గు చూపడం తెలియదు కానీ వైసీపీ కి అత్యంత ఘోర పరాజయం , కూటమికి అత్యంత ఘన విజయం దక్కింది.
ఇక దానితో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు. ఇక చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాకముందు మేము అధికారంలోకి వచ్చినట్లు అయితే సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామని చెప్పాడు. అలాగే మరికొన్ని పథకాలను కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తాం అని చెప్పాడు. ఇక ఆ పథకాల కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్న జనాలకు నిరాశనే ఎదురయ్యే పరిస్థితులు కనబడుతున్నాయి. బాబు ఎప్పటికప్పుడు శ్వేత పత్రాల పేరుతో కాలాన్ని గడిపేస్తున్నాడు.
ఇకపోతే బడ్జెట్ సమావేశాలలో కూడా శ్వేత పత్రాలు ముందుకు వచ్చాయి. ఇక బాబు , జగన్ పరిపాలించిన ఐదు సంవత్సరాలలో రాష్ట్రం అప్పుల పాలయ్యిందని , ఆయన కాలంలో ఎన్నో లక్షల కోట్లు రాష్ట్రం అప్పుల్లో కోరుకు పోయింది అని తెలియజేస్తూ వస్తున్నాడు. ఇక జగన్ మేము అధికారంలోకి వచ్చే ముందే అనేక అప్పులు ఉన్నాయి అని , వాటిని మేము సరిదిద్దీ అప్పుల సంఖ్యను తగ్గించాము అని చెబుతున్నాడు. అలాగే అన్ని కోట్లలో అప్పులు ఉన్నాయి అని తెలిసి కూడా మీరెందుకు అన్ని హామీలు ఇచ్చారు.
అవి తీర్చడం చేతకాకే మాపై బురద చల్లుతున్నారు అని ఆయన అంటున్నాడు. ఇక దేనికైనా చంద్రబాబు స్వేత పత్రాన్ని విడుదల చేస్తూ హంగామా చేస్తున్నాడు. మరి శ్వేత పత్రాలు కాకుండా జనాలకు బడ్జెట్ ద్వారా అన్ని పథకాలను అమలు చేస్తే బాగుంటుంది అని చాలా మంది భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: