బడ్జెట్ బెంగ : చంద్రబాబుకు ముందే తెలుసు.. మోసపోయింది ప్రజలేనా?

praveen
2019 అసెంబ్లీ ఎన్నికల్లో బంగపడిన టిడిపి ప్రతిపక్ష హోదాకి మాత్రమే పరిమితమైంది. అయితే 2024 లో మాత్రం ఒంటరిగా పోటీ చేయకుండా జనసేన బీజేపీ పార్టీల మద్దతు కూడగట్టుకుని కూటమిగా బరిలోకి దిగింది. ఈ క్రమంలోనే అఖండమైన విజయాన్ని సాధించింది. 175 సీట్లకు 164 స్థానాలలో విజయం సాధించి.. ఇక కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఎన్నికల ప్రచారం సమయంలో చంద్రబాబు ఏకంగా సూపర్ సిక్స్ గ్యారంటీలు అంటూ 6 హామీలను ప్రకటించారు అన్న విషయం తెలిసిందే.

 ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు ఈ ఆరు గ్యారెంటీలను ఎలా అమలు చేస్తారు అనే విషయంపై చర్చ జరుగుతూ వచ్చింది. ఎందుకంటే గతంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్రకటించిన దాని కంటే కాస్త ఎక్కువ మొత్తంలోనే డబ్బులు పంచే విధంగా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు చంద్రబాబు. కానీ గతంలో సంక్షేమ పథకాల పేరుతో రాష్ట్ర ఖజానాను జగన్ ఖాళీ చేస్తున్నారని.. అప్పులు పెరిగిపోతున్నాయని ఈ అప్పుల భారం ప్రజలపై పడుతుంది అంటూ విమర్శలు చేశారు. అయితే ఇలా అప్పులు పెరగకుండా చంద్రబాబు ఇచ్చిన హామీలను ఎలా అమలు చేస్తారు అనే విషయంపై రాజకీయ విశ్లేషకులు కూడా ఆసక్తిగా ఎదురు చూసారు.

 అయితే ఇక ఇలా చంద్రబాబుకు ఓటు వేసి  ఇప్పుడు సూపర్ సిక్స్ హామీల కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న ప్రజలందరికీ షాక్ ఇచ్చేలా ఇప్పుడు చంద్రబాబు యూ టర్న్ తీసుకున్నారు. ఇటీవల అసెంబ్లీ సమావేశాలలో భాగంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై శ్వేత పత్రం విడుదల చేశారు చంద్రబాబు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసారు. ఆర్థిక పరిస్థితి పై ఆవేదన కలుగుతుంది అంటూ వ్యాఖ్యానించారు. దీన్నిబట్టి జగన్ ప్రభుత్వం అప్పులు ఎక్కువయ్యాయి. ఇక ఇప్పుడు ఇచ్చిన సూపర్ 6 హామీలను అమలు చేయడం అన్న విషయాన్ని చెప్పకనే చెప్పారు చంద్రబాబు.

 అయితే ఎన్నికల ప్రచారం సమయంలో రా కదలిరా సభలో చంద్రబాబు ఇచ్చిన సూపర్ హిట్స్ హామీలు చూసుకుంటే.. ప్రతి ఆడబిడ్డకి ఇక నెలకు 1500 రూపాయలు ఇస్తామని మహాశక్తి పథకాన్ని ప్రవేశపెట్టారు. తల్లికి వందనం పథకం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి ఇస్తామని చెప్పారు. ప్రతి ఒక్కరు ముగ్గురు బిడ్డలను కనాలనీ పిలుపునిచ్చారు. మహిళలకు ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తానని ప్రకటించారు. వీటితోపాటు ఉచిత ఆర్టీసీ ప్రయాణం. ఇక అన్నదాన కార్యక్రమం ద్వారా ప్రతి ఏడాది రైతులకు 20వేల రూపాయలు ఆర్థిక సహాయం. ఇక నిరుద్యోగులకు ఏకంగా 3000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఈ హామీల అమలు విషయంలో యూటర్న్ తీసుకున్నారు.


 ఎందుకంటే రాష్ట్ర బడ్జెట్ తో ఈ హామీలు అమలు కావని  చంద్రబాబుకు ముందే తెలుసు  కానీ ప్రజలే ఆలోచించలేకపోయారు  జగన్ సంక్షేమ పథకాలు అమలు చేసి అప్పులు చేశాడని విమర్శించిన చంద్రబాబు.. తన సంక్షేమ పథకాలను ఎలా అమలు చేస్తారో.. అవి కూడా అమలు చేయాలంటే అప్పులే కదా కావాల్సింది అన్న విషయాన్ని ఏపీ ప్రజలు ముందుగా ఆలోచన చేయలేకపోయారు.


 దీంతో ఇక ఇప్పుడు మోసపోయింది ప్రజలే అని కొంతమంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: