బడ్జెట్ బెంగ: సూపర్ సిక్స్ ఇప్పట్లో లేనట్టే.!

Pandrala Sravanthi
- గెలుపే లక్ష్యంగా ఉచిత హామీలు.
- బడ్జెట్ సరిపోదని భయాందోళనలు.
- చంద్రబాబుకిదే అసలు సవాల్.!

చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్రంతో విడిపోయిన తర్వాత మూడవసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాడు. 2019లో అధికారాన్ని పోగొట్టుకున్నటువంటి చంద్రబాబు నాయుడు 2024 లో ఎలాగైనా అధికారాన్ని చేపట్టాడని ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసి చివరికి బిజెపి, జనసేనతో పొత్తు పెట్టుకుని 164 సీట్లు సాధించి అద్భుతమైన మెజారిటీతో అధికారంలోకి వచ్చారు.. అంతేకాదు ఆయన ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ పథకాలను అద్భుతంగా అమలు చేస్తానని ఎన్నో హామీలు ఇచ్చాడు. దీంతో ప్రజలు కూడా నమ్మి ఆయనకు ముకుమ్మడిగా ఓట్లు వేశారు. వాస్తవానికి ఆయన ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలి అంటే ఏపీ బడ్జెట్ సరిపోదు. ఒకవేళ హామీలు అమలు చేయాలంటే అభివృద్ధి ఆగిపోవాలి.. అభివృద్ధి ఆగిపోతే హామీలు అమలవుతాయి. ఇలా ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి తయారయింది. దీనికి తోడు కేంద్ర సపోర్ట్ కూడా అధికంగా లేకపోవడంతో చంద్రబాబు తలామునకలవుతున్నారట. మరి చూడాలి ఆయన సూపర్ సిక్స్ పథకాలను ఎలా అమలు చేస్తారో దాని కోసం ఎలాంటి ఇబ్బందులు పడతారు అనే వివరాలు చూద్దాం.
 చంద్రబాబుకు సవాల్ :
 అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో మంత్రి నారా లోకేష్  కామెంట్లు చేశాడు. అమ్మకు వందనం పథకాన్ని ఇంట్లో అందరికీ అందిస్తామని  చెప్పాము కాబట్టి దీన్ని ఈ ఏడాది అమలు చేసే అవకాశం లేదని ఆయన చెప్పకనే చెప్పేశారు. దీనికి ప్రధాన కారణం  పథకాన్ని అమలు చేయాలంటే మొత్తం డీటెయిల్ గా సర్వే చేయాలి. మొత్తం ఎంతమంది అర్హులు ఉన్నారో తెలుసుకోవాలి. ఆ తర్వాతే అమలు చేయాలంటే ఈ ఏడాది సమయం సరిపోదని చెప్పేసాడు.  అంతేకాకుండా పథకాలే కాకుండా ఉచిత బస్సు కూడా ఆగస్టు నుంచి మొదలు పెడతా అన్నారు.  దానిపై దానిపై కూడా పూర్తి క్లారిటీ రాలేదు. ఈ విధంగా చంద్రబాబు ప్రభుత్వం  సూపర్ సిక్స్ పథకాలపై  వాయిదా పద్ధతిని అనుసరిస్తూ రావడం అందరిని  ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అంతేకాదు అసెంబ్లీ సమావేశాల్లో కూడా వీరు ఈ పథకాలపై ఎలాంటి సమాధానం ఇవ్వకపోగా, నారా లోకేష్ అమ్మకు వందనం లాంటి పథకాలు అమలు చేయడానికి ఇంకా టైం పడుతుందని ఈ సంవత్సరం రివ్యూ చేసిన తర్వాత అమలు చేస్తామని చెప్పడంతో  ఏపీ ప్రజలంతా షాక్ అయిపోతున్నారు. ఈ ఏడాది పథకాల అమలు లేనట్టే అని అందరూ ఫిక్స్ అయిపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: