బ‌డ్జెట్ బెంగ‌: జ‌గ‌న్ చెప్పింది నిజ‌మేనా? అప్ప‌ట్లో ఏం జరిగింది?

Reddy P Rajasekhar
2019 సంవత్సరంలో ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చే సమయానికి ఖజానాలో కేవలం 100 కోట్ల రూపాయలు మాత్రమే ఉన్నాయి. పసుపు కుంకుమ స్కీమ్ తో పాటు ఇతర పథకాలకు నిధులను ఎక్కువ మొత్తంలో ఖర్చు చేసిన నేపథ్యంలో అప్పట్లో ఏపీ ఖజానా ఖాళీ అయిన పరిస్థితి నెలకొంది. అయితే ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా జగన్ బడ్జెట్ విషయంలో చంద్రబాబుపై నిందలు వేయడం కానీ పథకాల అమలు విషయంలో వెనక్కు తగ్గడం కానీ చేయలేదు.
 
2019లో జగన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టడంతో పాటు తాను చెప్పిన పథకాలను చెప్పిన విధంగా అమలు జరిగేలా బడ్జెట్ లో నిధులను కేటాయించారు. రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెట్టే ధైర్యం కూడా చంద్రబాబుకు లేదంటూ జగన్ తాజాగా చేసిన సంచలన విమర్శలు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతున్నాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన మోసపూరిత హామీల గురించి చెప్పాల్సి వస్తోంది కాబట్టే బాబు రెగ్యులర్ బడ్జెట్ ను ప్రవేశపెట్టడం లేదని జగన్ వెల్లడించారు.
 
రాష్ట్రం పురోగతి వైపు వెళ్తుందా లేక రివర్స్ లో వెళ్తుందా అనే ఆలోచనలు ప్రజల్లో ఉన్నాయని జగన్ కామెంట్లు చేయడం గమనార్హం. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుల లెక్కలు చెప్పడం చంద్రబాబుకు సాధ్యం కావడం లేదని ఈ అప్పుల లెక్కలను దాచేయడానికి చంద్రబాబు నాయుడు పడరాని పాట్లు పడుతున్నాడని జగన్ పేర్కొన్నారు. శ్వేత పత్రాలతో బాబు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోందని జగన్ చెప్పుకొచ్చారు.
 
ఏపీ అప్పు 7 లక్షల 48 వేల కోట్లు మాత్రమేనని గవర్నర్ తో సైతం అప్పుల గురించి అసత్యాలు పలికించారని జగన్ పేర్కొన్నారు. మరి జగన్ చేసిన కామెంట్ల గురించి టీడీపీ నేతల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాల్సి ఉంది. ఏపీ బడ్జెట్ కు సంబంధించి నెలకొన్న అయోమయం రాష్ట్ర ప్రజలను సైతం ఒకింత కంగారు పెడుతోంది. చంద్రబాబు రెగ్యులర్ బడ్జెట్ ను ప్రవేశపెట్టకపోవడం మాత్రం తప్పేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: