ఏపీ: చుట్టూ ముడుతున్న భూవివాదాలు.. పెద్దిరెడ్డికి తప్పని తిప్పలు..!

Divya
గత సర్కారులో రాయలసీమ ప్రాంతానికి మకుటం లేని  మహారాజుగా ఒక వెలుగు వెలిగారు పెద్దిరెడ్డి.. కానీ ఈసారి ఎన్నికలలో ఈయన అధికారం మొత్తం గల్లంతయ్యింది. తన పార్టీ అధికారం కోల్పోవడంతో ఆయన చుట్టూ అన్ని కష్టాలు చుట్టుముట్టాయి. ఇటు ప్రభుత్వం అటు ప్రజలు ఒకేసారి తన మీదికి దండెత్తి వస్తున్నట్లు తెలుస్తోంది. కష్టకాలం నుంచి బయటపడే మార్గం లేక సతమతమవుతున్నారు పెద్దిరెడ్డి. ముఖ్యంగా వైసీపీలో సీఎం జగన్ తర్వాత.. రెండవ స్థానంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిది హవా అని చెప్పవచ్చు.

రాయలసీమకి చెందిన ఈయన గత ఐదేళ్ల నుంచి రాష్ట్రాన్ని మొత్తం శాసించారు. మంత్రిగా రాయలసీమ ప్రాంత వాసిగా కూడా కీలకమైన పాత్రను వ్యవహరించారు పెద్దిరెడ్డి. ప్రస్తుతం అధికారపక్షం వైసిపి అధినేత జగన్ తో పాటు అటు పెద్దిరెడ్డిని కూడా టార్గెట్ చేస్తూ పలు రకాల విమర్శలు అయితే చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా జగన్ పై కంటే ఎక్కువగా పెద్దిరెడ్డిని వివాదాలు చుట్టుముడుతున్నాయి.. అలాగే విజయవాడలో కాలుష్యం నియంత్రణ మండల ఫైల్లు దహనం పైన ఆరోపణలు వినిపించాయి.

అలాగే మదనపల్లిలో గత కొద్దిరోజుల క్రితం జరిగిన ఫైర్ యాక్సిడెంట్ కూడా పెద్దారెడ్డి మీదే అనుమానాలు ఉన్నాయంటూ పలు రకాల ఆరోపణలు చేస్తున్నారు చంద్రబాబు. అలాగే తిరుపతిలో పెద్దిరెడ్డి కార్యాలయానికి కార్పొరేషన్ నిధుల వల్ల రోడ్డు వేసుకున్నారని.. ఆ రోడ్డుకు అడ్డంగా గేటు పెట్టారని కూడా పలువురు జనసేన పార్టీ నేతలు తెలిపారు. ఇలా చిత్తూరు జిల్లాలో జరిగే ప్రతి వివాదం కూడా పెద్దిరెడ్డికే చుట్టుకుంటున్నాయి. ఇప్పుడు తాజాగా పుంగనూరు మండలంలో 980 ఎకరాలను పెద్దిరెడ్డి ఆయన అనుచరులు తమ పేర్ల పైన రాసుకున్నారని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి వీటిపైన దర్యాప్తు జరుగుతూ ఉండగానే మదనపల్లి కూడా ఫైల్ లో ఒక్కసారిగా దగమైన ఘటన ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే దీంతో పెద్దిరెడ్డి బాధితులమంటూ సుమారుగా 300 మంది ఒకేసారి మదనపల్లి కలెక్టర్కు తరలిరావడంతో భూములు అక్రమాలను చేశారంటూ ఫిర్యాదు చేయడం ఒక సంచలనం గా మారింది. అలాగే మైనింగ్ లీజులు ఇసుక తవ్వకాలలో ఆరోపణలలో అన్నీ కూడా తన తమ్ముడు ద్వారకానాథ్ రెడ్డి కూడా హస్తము ఉందని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఈసారి పెద్దిరెడ్డికి తిప్పలు తప్పేలా కనిపించడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: