బడ్జెట్ బెంగ : బాబుకు జై కొట్టడమే తప్పా.. పవన్ చేసిందేంటి.. ప్రశ్నించిందేంటి..?

murali krishna

* రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూసి భయమేస్తుంది అంటున్న చంద్రబాబు
* చంద్రబాబు డ్రామాలు ఆపి హామీల అమలుపై దృష్టి సారించాలని వైసీపీ డిమాండ్
 
* ఎన్నికల మందు హడావిడి చేసిన పవన్ ఇప్పుడు సైలెంట్ అవ్వడానికి కారణం అదేనా..?

2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అత్యధిక స్థానాలు సాధించి సంచలనం సృష్టించింది. గత ఎన్నికల్లో 151 స్థానాలు సాధించి చరిత్ర సృష్టించిన వైసీపీ పార్టీ ఈసారి కేవలం 11 సీట్లు మాత్రమే సాధించి ప్రతిపక్ష హోదాని కోల్పోయింది. అయితే సూపర్ సిక్స్ హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమీ ప్రభుత్వానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి భారంగా మారింది. కూటమి ఇచ్చిన హామీలు నెరవేర్చాలి అంటే భారీగా నిధులు అవసరం అవుతాయి. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉండటంతో సూపర్ సిక్స్ హామీల అమలు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూలై 22 నుంచి అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. దాదాపు 5 రోజులు పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలలో కేంద్రం ప్రకటించిన 15000 కోట్ల నిధుల గురించి చర్చించడం జరిగింది. అలాగే పలు శాఖల నుంచి శ్వేత పత్రాలు కూడా విడుదల చేయడం జరిగింది. ఇదిలా ఉంటే తాజాగా  రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై అసెంబ్లీలో శ్వేత పత్రం విడుదల సందర్భంగా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై ఆవేదన కలుగుతుంది. సూపర్ సిక్స్ అంటూ హామీలను అయితే ఇచ్చాము కానీ ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తే భయమేస్తుంది. ఈ హామీలపై ముందుకు కదల లేక పోతున్నాం. ప్రస్తుత పరిస్థితి పై రాష్ట్ర ప్రజానీకం కూడా అర్థం చేసుకోవాలని చంద్రబాబు తెలిపారు.

గత వైసిపి హయాంలో రూ. 9,74,000 కోట్లు అప్పులైనట్లు సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రతి ఒక్కరిపై తలసరి అప్పు రూ.1,44,336 కి పెరిగిందని ఆయన తెలిపారు. రాష్ట్ర ఆదాయం 13.2 శాతం నుంచి 9.5 శాతానికి తగ్గింది. రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులన్నీ తాకట్టు పెట్టేశారు. ప్రతి డిపార్ట్మెంట్లో రోజువారి ఖర్చుల నిధులు కూడా ఖాళీ చేశారు. అలాగే మద్యం అమ్మకాలపై కూడా జగన్ అప్పులు తీసుకొని వచ్చారు. రానున్న 15 ఏళ్లు మద్యంపై వచ్చే ఆదాయాన్ని మనం అప్పుగా కట్టాల్సి వుందని చంద్రబాబు తెలిపారు. దీంతో ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టలేక పోతున్నాను అని చంద్రబాబు నాయుడు తెలిపారు.మరో రెండు నెలల్లో రాష్ట్ర వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెడతాము అని చెప్పారు. ఇదిలా ఉంటే రాష్ట్ర అప్పులు,ఆర్థిక పరిస్థితి పై ప్రభుత్వం అబద్ధాలు చెప్పింది అంటూ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ కు జగన్ లేఖ రాశారు. అలాగే అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంలోని కొన్ని అంశాలను ప్రభుత్వం వక్రీకరించిందని తెలిపారు. ఏపీలో అప్పులు దాదాపు 10 లక్షల కోట్లు ఉన్నాయని సీఎం చంద్రబాబు చెప్పారని కానీ వాస్తవంగా రాష్ట్ర అప్పులు రూ. 5.16 కోట్లే అని జగన్ ఆ లేఖలో పేర్కొన్నారు.
అయితే కూటమి అధికారంలోకి రావడానికి ప్రధాన కారకంగా నిలిచిన పవన్ కళ్యాణ్ మాత్రం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి చంద్రబాబుని ప్రశ్నించలేకపోతున్నారు. పైగా చంద్రబాబు నాయుడు అనుభవ శాలి అని ఆయన ఏమి చేసినా కరెక్ట్ గానే ఉంటుందని చెప్పుకొస్తున్నారు. సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చకూడదనే ఉద్దేశంతోనే చంద్రబాబు ఇలాంటి డ్రామాలు ఆడుతున్నారని దానికి పవన్ కళ్యాణ్ వంత పాడుతున్నారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు.. కూటమీ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై పవన్ కళ్యాణ్ సైతం బాధ్యతలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.ఎట్టి పరిస్థితులలో పథకాలు అమలు చేసి తీరాల్సిందేనని వారు పట్టుబడుతున్నారు మరి రానున్న రోజులలో ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకోనన్నాయో  వేచి చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: