జగన్: కాంగ్రెస్ పార్టీపై.. సంచలన వ్యాఖ్యలు.. షర్మిలకి కూడా కౌంటరేనా..?

Divya
గడచిన రెండు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో వెళ్లి ధర్నా చేయడం జరిగింది.. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అరాచకాల పైన ఈ ధర్నా చేశారు ఇందులో భాగంగా చాలా పార్టీల సైతం జగన్కు మద్దతుగా నిలిచాయి. ఇందులో ఇండియా కూటమిలో కీలకమైన కాంగ్రెస్ పార్టీ పైన జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. కూటమిలో అతిపెద్ద పార్టీ అయినటువంటి కాంగ్రెస్ ఎందుకు ఈ విషయం పైన ప్రశ్నించలేదంటూ కూడా కాంగ్రెస్ పైన ఫైర్ అయ్యారు జగన్.

జగన్మోహన్ రెడ్డి ఇలా మాట్లాడుతూ మణిపూర్ పరిస్థితుల పైన ఆందోళన వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ మణిపూర్ లో ఒక రూల్ అయితే ఏపీలో మరొక రూలా అంటూ ఆయన నిలదీశారు.. మణిపూర్ తరహాలోని ఇప్పుడు పరిస్థితి ఏపీలో కూడా ఉంది... కాంగ్రెస్ పార్టీ ఆంధ్రలో కూడా ఉంటే ఎందుకు రియాక్ట్ కావడం లేదని ప్రశ్నను కూడా వేశారు.. అయితే ఈ ప్రశ్న ఇన్ డైరెక్ట్ గా అటు కాంగ్రెస్ పార్టీని ఆంధ్రలో ఉన్న షర్మిలాను కూడా వేపినట్లు కనిపిస్తోంది. ఎన్డీఏలో టిడిపి పార్టీ కూటమిలో భాగంగా ఉన్నప్పటికీ కాంగ్రెస్కు ఏపీ సీఎం చంద్రబాబుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మధ్య లింక్ ఏంటో చెప్పాలి అంటూ తెలియజేశారు.

ఏపీలో ప్రభుత్వ తీరు పైన వ్యతిరేకంగా మాతో కలిసి వచ్చే పార్టీలతో మేము కచ్చితంగా కలిసి పోరాడుతామంటూ జగన్ క్లారిటీ ఇచ్చారు. ఏపీలో శాంతిభద్రతలు సైతం క్షీణించాయని రాష్ట్రపతి ప్రధాని కూడా జోక్యం చేసుకొని ఈ అరాచక పాలనను ఆపాలి అంటూ డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని ఢిల్లీ వరకు తీసుకువెళ్లారు. జగన్ మద్దతుగా మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, అన్న డీఎంకే, డీఎంకే ఇండియా కూటమిలోని పలు పార్టీలు కూడా సంఘీభావం తెలియజేశారు కానీ ఇండియా కూటమిలో అతిపెద్ద పార్టీగా ఉన్న కాంగ్రెస్ మాత్రం ఈ విషయం పైన సైలెంట్ గా ఉండడంతో జగన్ ఫైర్ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: