అదే జరిగితే.. అందరూ BSNL లోకే?

praveen
ప్రస్తుత టెక్నాలజీ యుగంలో మొబైల్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగంగా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. కేవలం మనిషి అవసరాలు తీర్చడానికి మాత్రమే అందుబాటులోకి వచ్చిన మొబైల్.. ఏకంగా ప్రస్తుతం మనిషిని బానిసగా మార్చేసుకుంటుంది. దీంతో ఇక మొబైల్ లేకుండా కేవలం ఒక్క క్షణాన్ని కూడా ఊహించుకోలేని పరిస్థితిలో ప్రస్తుతం జనాలు ఉండిపోతూ ఉన్నారు. అయితే నేటి రోజుల్లో నెట్వర్క్ సేవలు అందించేందుకు ఎన్నో రకాల కంపెనీలు అందుబాటులో ఉన్నాయి.

 అయితే మొన్నటి వరకు తమ కస్టమర్ల సంఖ్యను పెంచుకునేందుకు మిగతా కంపెనీలతో పోల్చి చూస్తే ఎంతో ఆకర్షనీయమైన ఆఫర్లను ప్రకటిస్తూ ఉండేవి అన్ని నెట్వర్క్ కంపెనీలు. కానీ ఈ మధ్యకాలంలో మాత్రం కస్టమర్లను బాదడమే లక్ష్యంగా పెట్టుకున్నాయేమో అన్న విధంగా చార్జీలను పెంచేస్తూ ఉన్నాయ్ అన్న విషయం తెలిసిందే. ఇటీవల జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా రీఛార్జ్ ధరలు అమాంతం పెంచడంతో సామాన్య ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

 అయితే ఇలా జియో ఎయిర్టెల్ వోడాఫోన్ ఐడియా కంపెనీలు ఒకసారిగా చార్జీలు పెంచడంతో దేశంలోని మొబైల్ వినియోగదారులు అందరు చూపు కూడా బిఎస్ఎన్ఎల్ పై పడింది. ఎందుకంటే బిఎస్ఎన్ఎల్ ఎంతో ఆకర్షణీయమైన ప్లాన్స్ ఇటీవల ప్రకటించింది అన్న విషయం తెలిసిందే. కానీ ఇప్పటికీ కూడా కొంతమంది బిఎస్ఎన్ఎల్ మారెందుకు కాస్త వెనుక ముందు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ప్రైవేట్ కంపెనీలు 5g సేవలు సైతం అందిస్తుంటే.. బిఎస్ఎన్ఎల్ మాత్రం 4g సేవలు అందించేందుకే ఇంకా తంటాలు పడుతుంది. అయితే ఇటీవల కేంద్రం బడ్జెట్లో బిఎస్ఎన్ఎల్ కోసం 82,916 కోట్ల రూపాయలను కేటాయించింది. ఇక కేంద్రం ఇలాగే బిఎస్ఎన్ఎల్ అండగా నిలిస్తే మాత్రం ప్రైవేట్ కంపెనీలు మటుమాయం అయ్యే అవకాశం ఉందని ఇక.. మొబైల్ వినియోగదారుడు  అందరూ బిఎస్ఎన్ఎల్ లోకి మారే ఛాన్స్ ఉంది అంటూ ఎంతోమంది నిపుణులు అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: