ఏపీ: చంద్రబాబుపై మాజీ సీఎం ఫైర్ ..!

Divya
ఏపీ ప్రభుత్వం పైన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు.ఈ రోజున తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురోగతివైపు వెళుతోందా లేకపోతే రివర్స్ గా వెళుతోందా అనే విధంగా ఏపీ సీఎం చంద్రబాబుని ప్రశ్నించారు.. ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని ఆలోచించాలని రాష్ట్రంలో హత్యలు అత్యాచారాలు జరుగుతున్నాయని అయితే బాధితులపైన పోలీసులు కేసులు పెట్టడం కేవలం ఆంధ్రాలోనే మాత్రమే చూస్తున్నాను అంటూ ఫైర్ అవుతున్నారు. బడ్జెట్ ప్రవేశ పెట్టలేదని అద్వాన పరిస్థితులలో ఈ ప్రభుత్వం ఉందంటూ కూడా ఫైర్ అయ్యారు మాజీ సీఎం జగన్.

పూర్తిస్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టే ధైర్యం కూడా లేదని సాధారణ బడ్జెట్ పెడితే హామీలను కేటాయించాల్సి ఉంటుందని హామీలకు నిధులు కేటాయించకపోతే కచ్చితంగా ప్రజలు తిరుగుబాటు చేసి రోడ్డు ఎక్కుతారని భయంతోనే చంద్రబాబు అసలు పూర్తి బడ్జెట్ని ప్రవేశపెట్టడం లేదంటూ తెలిపారు.. చంద్రబాబుది కేవలం వంచన గ్లోబెల్స్ సిద్ధాంతమంటూ తెలియజేశారు హామీలు ఇవ్వడం మోసం చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అంటే తెలిపారు. అందుకే రాష్ట్రం ఆర్థికంగా ధ్వంసం అయిందంటూ కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారంటే తెలియజేశారు.

కూటమి చెప్పిన హామీలు అమలు చేయకుండా తప్పించుకునేందుకే ఇలాంటి సాకులు ఎక్కువగా చెబుతూ ఉంటారని జగన్ ఫైర్ అయ్యారు. రాష్ట్రానికి 14 లక్షల కోట్లు అప్పు ఉన్నట్లు ప్రచారం చేస్తున్నారని అసలు అందులో లేనిది ఉన్నట్లుగా గ్లోబల్స్ ప్రచారం చేసుకుంటున్నారు అంటూ తెలిపారు. అప్పులను బడ్జెట్లో చూపించలేక ఎన్నో పాటలు పడుతున్నారని కూడా తెలియజేశారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. అయితే ఇప్పటికే కేవలం పెన్షన్ పెంపు వ్యవహారాన్ని మాత్రమే చంద్రబాబు అమలు చేశారు.. అలాగే తల్లికి వందనం, మహిళా శక్తి, ఉచిత గ్యాస్ సిలిండర్స్, ఫ్రీ బస్సు వంటివి ఇంకా అమలు చేయలేదు.. అలాగే రైతులకు రైతు భరోసా కూడా ఇవ్వలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: