వైసీపీలో బిగ్ వికెట్ డౌన్‌... జ‌గ‌న్‌కు కంప్లైంట్ కూడానా..?

RAMAKRISHNA S.S.
కీలకమైన శాసనమండలి చైర్మన్ వ్యవహారం ఇప్పుడు వైసీపీలో రాజకీయంగా దుమారం రేపుతుంది. గతంలో వైసిపి ప్రభుత్వం వచ్చినప్పుడు మండలి ఛైర్మన్ గా ఉన్న అప్పటి టిడిపి నాయకుడు మహ్మ‌ద్ షరీఫ్ అనుసరించిన‌ట్టు ప్రస్తుతం వైసీపీ నాయకుడు మండలి చైర్మన్ గా ఉన్న కొయ్యే మోషేన్‌ రాజు అనుసరిస్తున్న తీరుకు చాలా వ్య‌త్యాసం కనిపిస్తుందని వైసిపి ఎమ్మెల్సీ ల్లోనే చర్చ సాగుతోంది. గతంలో షరీఫ్ వైసీపీని పట్టించుకునే వారు కాదు.. పైగా అప్పటి మంత్రులు మండలి లో సమాధానం ఇస్తుంటే ఆయన సందేహాలు వ్యక్తం చేసేవారు.

దీంతో అప్పటి అధికార ప‌క్షంగా ఉన్న వైసీపీకి మండలి చైర్మన్ నుంచే సెగ తగిలింది. మరీ ముఖ్యంగా మూడు రాజధానులు బిల్లు ఆమోదం కాకుండా ఉండటానికి కోర్టుకు వెళ్లడానికి చైర్మన్ షరీఫ్ కూడా ఒక కారణం అన్నది తెలిసిందే. అయితే ప్రస్తుత వైసీపీ నేత మండలి చైర్మన్ గా ఉన్న కొయ్యే మోషన్ రాజు యూటర్న్ తీసుకుంటున్నారు. మండలిలో టిడిపి మంత్రులు .. కూటమి ప్రభుత్వంలో మంత్రులు వైసిపి ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నా.. అప్పుడు లోపాలను ఎత్తిచూపుతున్న ఆయన మౌనంగా ఉంటున్నారు. అంతే కాదు మండలిలో లేని వారిపై కూడా టిడిపి మంత్రులు విమర్శలు చేస్తుంటే ఆయన మౌనంగా ఉంటున్నారని టాక్‌.

పైగా టిడిపి తో పాటు ఇతర ఉపాధ్యాయ సంఘాల ఎమ్మెల్సీలకు ప్రాధాన్యం ఇస్తున్నారే తప్ప వైసీపీ ఎమ్మెల్సీలకు ఎంత మాత్రం ప్రాధాన్యం ఇవ్వటం లేదని ఆ పార్టీ ఎమ్మెల్సీలు రగిలిపోతున్నాయి. ఇదే విషయంపై వైసీపీకి చెందిన కొందరు ఎమ్మెల్సీలు మోషన్ రాజు పై జగన్‌కు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. ఓవరాల్ గా చూస్తే వైసీపీలోనే కొందరు మాత్రం మోషన్ రాజు పార్టీ మారిపోతారు అన్న సందేహాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా మోషేన్ రాజు కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించడం మాత్రం వైసిపి వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: