జగన్: ఏపీ అప్పులు 14 లక్షల కోట్లు కానే కాదు... అసలు ఎంతంటే ?

Veldandi Saikiran
చంద్రబాబు పాలనపై ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ మీడియాతో మాట్లాడిన జగన్‌... ఏపీ అప్పుల చిట్టా విప్పారు. 52 రోజులుగా ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం పురోగతి వైపు వెళ్తోందా ? తిరోగమనంలో వెళ్తోందా ? అనే సందేహం అందరిలోనూ నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు జగన్‌. ఈ విషయంపై ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయాలని కోరారు.

దాడులు, అత్యాచారాలు, ఆస్తుల ధ్వంసం జరుగుతోందని నిప్పులు చెరిగారు. ప్రశ్నించే స్వరం ఉండకూడదు అనే విధంగా ప్రభుత్వం అణిచివేత ధోరణితో ముందుకు వెళ్తోందని తెలిపారు ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డి. రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశ పెట్టే ధైర్యం కూడా చంద్రబాబు కి లేదని.. చురకలు అంటించారు. ఆంధ్ర ప్రదేవ్‌ రాష్ట్రం మొత్తం అప్పు 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చే సమయానికి 1.53 లక్షల కోట్లు ఉందన్నారు. 2019లో చంద్రబాబు దిగే సమయానికి 4.08 లక్షల కోట్లకు చేరిందని వివరించారు.

ఇక వైసీపీ అధికారం దిగిపోయే సమయానికి 7.48 వేల కోట్లు అప్పు ఉందని క్లారిటీ ఇచ్చారు. 21.63 శాతం అప్పులు చేసిన చంద్రబాబు ఆర్ధిక ధ్వంసం చేశారా ? అని ప్రశ్నించారు. వైసీపీ హయంలో 12.90 శాతం అప్పులు చేశామని తెలిపారు. ఇలా తప్పుడు లెక్కలు అసత్యాలు చెప్పటం ధర్మమేనా ? అంటూ ఆగ్రహించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల నుంచి తప్పుకోవడానికి చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు.  

ఎన్నికలు అయ్యాక అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చంద్రబాబు ఇదే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహించారు. 14 లక్షల కోట్లు ఉన్నాయి అని చంద్రబాబు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. లేని అప్పు ఉన్నట్టుగా చంద్రబాబు చెబుతున్నారని మండిపడ్డారు. కొవిడ్ సమయం ఎదుర్కొన్నా కూడా చంద్రబాబు కంటే తక్కువగా అప్పులు చేశామని తెలిపారు జగన్‌.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: