హైద‌రాబాద్‌లో మ‌రో సైబ‌రాబాద్ సిటీ.. ఎక్క‌డో తెలుసా...!

RAMAKRISHNA S.S.
గ్రేట‌ర్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం జెట్ స్పీడ్ తో దూసుకుపోతోంది. గ్రేటర్ సిటీ నలువైపులా భారీ భారీ ప్రాజెక్టులు వేగం పుంజుకుంటోంది. అస‌లు ప‌లు కార్యాల‌యాల భ‌వ‌నాల‌తో పాటు నివాస భ‌వ‌నాలు పుట్ట గొడుగుల్లా పుట్టుకు వ‌స్తున్నాయి. ఇక న‌గ‌రం చుట్టూ ఉన్న ఔట‌ర్ రింగ్ రోడ్ ప‌రిస‌ర ప్రాంతాల్లో అయితే వంద‌ల సంఖ్య‌లో నిర్మాణాలు జ‌రుగుతున్నాయి. ఇక హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రాన్ని విస్త‌రించేందుకు రేవంత్ స‌ర్కార్ అయితే కొత్త కొత్త ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తోంది. ఇప్ప‌టికే గ్రేట‌ర్ హైద‌రాబాద్ .. అటు సైబ‌రాబాద్ న‌గ‌రాలు అభివృద్ధి చెందాయి.

చుట్టు ప‌క్క‌ల ఎక్క‌డ చూసినా కొత్త కొత్త ప‌ట్ట‌ణాలు.. చిన్న చిన్న మున్సిపాల్టీలు తెగ పుట్టుకు వ‌చ్చేస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే న‌గ‌రాన్ని మ‌రింత‌గా విస్త‌రించేందుకు రేవంత్ స‌ర్కార్ స‌రికొత్త ప్ర‌ణాళిక‌లు రచిస్తోంది. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు మ‌హేశ్వ‌రం వైపు పూర్తిగా మ‌రో సైబ‌రాబాద్ త‌ర‌హా కొత్త సిటీని నిర్మించాల‌ని ప్లాన్ చేస్తోంది. ఈ కొత్త సిటీ అంతా మ‌హేశ్వ‌రం ప‌ట్ట‌ణాన్ని ఆనుకుని ఉండ‌బోతోంది. ఇక మ‌హేశ్వ‌రం వైపు మ‌రో సైబ‌రాబాద్ త‌ర‌హా సిటీ నిర్మించాల‌ని రేవంత్ కంక‌ణం క‌ట్టుకుని ఉన్నాడు.

గ్రేట‌ర్ హైదరాబాద్ మహానగరం చుట్టూ ఉన్న మొత్తం 29 మున్సిపాలిటీలు ఉన్నాయి. వాటిని కలిపేసి రెండు కొత్త మున్సిపల్ కార్పొరేషన్లుగా మార్చాలని రేవంత్ స‌ర్కార్ ప్లాన్ చేస్తోంది. వీటిల్లో మణికొండ, బండ్లగూడ జాగీర్, నార్సింగి, జల్‌ప‌ల్లి, ఆదిభట్ల, బడంగ్ పేట్, ఇబ్రహీంపట్నం, తుర్కయాంజల్, తుక్కుగూడ వంటి మున్సిపాలిటీలతో మహేశ్వరం గ్రామీణ ప్రాంతాన్ని కలుపుతూ గ్రేటర్ మహేశ్వరం మున్సిప‌ల్ కార్పోరేష‌న్ గా కొత్త కార్పోరేష‌న్ ఏర్పాటు చేస్తున్నారు.

రేవంత్ స‌ర్కార్ ప్లాన్‌తో మ‌హేశ్వ‌రం ఏరియాకు మ‌హ‌ర్ద‌శ ప‌ట్ట‌నుంది. ప్ర‌స్తుతం అయితే మహేశ్వరం పరిసర ప్రాంతాల్లో అయితే డబుల్ బెడ్ రూమ్ ప్లాట్ 50లక్షలు ప‌లుకుతోంది. ఇది ఇప్పుడు కోటికి వెళ్లినా ఆశ్చ‌ర్య పోన‌వ‌స‌రం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: