హైద‌రాబాద్‌లో కొత్త మెట్రోలైన్‌... రేవంత్ మాస్ట‌ర్ స్కెచ్‌..?

RAMAKRISHNA S.S.
- కొత్త‌గా కోకాపేట్ వ‌ర‌కు 3.3 కిలోమీట‌ర్ల కొత్త లైన్‌
- ఓల్డ్ సిటీ టు శంషాబాద్ విస్త‌ర‌ణ ప్లాన్ కూడా రేవంత్ స‌ర్కార్ దే.. ?
( హైద‌రాబాద్ - ఇండియా హెరాల్డ్ )
హైదరాబాద్ మహానగరం శ‌ర వేగంగా అభివృద్ధి చెందుతుంది. అలాంటి హైదరాబాద్లో కోకాపేట్ అనగానే భారీ భవనాలు .. ఐటీ కంపెనీలు.. ఆ కంపెనీల్లో పనిచేసే వారి భారీ నివాస సముదాయాలు అందరి కళ్ళ ముందు క‌దులుతూ ఉంటాయి. వేలాది గేటెడ్ కమ్యూనిటీతో పాటు లగ్జరీ నివాస సముదాయాలు కోకాపేట్ లో అతి తక్కువ టైంలోనే పుట్టుకొచ్చాయి. దీంతో అక్కడ రోజురోజుకు ట్రాఫిక్ సమస్య బాగా పెరుగుతుంది. భవిష్యత్తులో కోకాపేట్ ట్రాఫిక్ ను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ బ్రాండ్ దెబ్బ తినకుండా ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంటుంది.

రేవంత్ రెడ్డి ప్రభుత్వం మెట్రోను కోకాపేట్ వరకు విస్తరించాలని నిర్ణయం తీసుకుంది. గతంలో రాయదుర్గం నుంచి శంషాబాద్ వరకు మెట్రో విస్తరణ కెసిఆర్ హయాంలో ప్రణాళికలు వేశారు. అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన వెంటనే రూటు మార్చి ఓల్డ్ సిటీ నుంచి శంషాబాద్ వరకు మెట్రో మార్గాన్ని తలపెట్టింది. రాయదుర్గం నుంచి ఉన్న అలైన్మెంట్ మార్చి యూఎస్ కాన్సులేట్ వరకు విస్తరించాలని ముందు అనుకున్నారు. అయితే ఈ ప్రతిపాదనను కూడా మార్చి కోకాపేట వరకు మెట్రోను విస్తరించాలని నిర్ణయం తీసుకున్నారు. కొత్త ప్రతిపాదన వల్ల 3.3 కిలోమీటర్ల మేరకు మెట్రో రైల్వే లైన్ పొడవు పెరుగుతుంది.

దీంతో విస్తరణ లైన్‌ కూడా మారింది. ఇందుకు తగినట్టుగానే కొత్త బడ్జెట్లో నిధులు కేటాయింపు చేశారు. ఈ మార్గంలోనే కాదు శంషాబాద్ వరకు పొడిగింపు మార్గంలోనూ అలైన్మెంట్ మరోసారి మార్పులను మెట్రో మార్గం మరో నాలుగు కిలోమీటర్ల మేర పెరగనుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం సొంత ఖర్చుతోనే ఈ మెట్రో నిర్మించే ఆలోచనలో ఉంది. ఇక మియాపూర్ నుంచి పటాన్ చెరు రూట్ లోను యధాతధంగా మెట్రో నిర్మించబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: