మోడీ మాయ : ఏపీకి లెక్కల్లో బాగానే ఉంది.. వాస్తవంలో అవన్నీ జరిగేనా..?

Pulgam Srinivas
2014 వ సంవత్సరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయి తెలంగాణ సపరేట్ అయింది. అలా విడిపోయిన సందర్భంలో విభజన చట్టం కింద ప్రభుత్వం అనేక హామీలను ఇచ్చింది. కాలం గడుస్తున్న ఆ హామీలు మాత్రం నెరవేరలేదు. 2014 వ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు.
ఆ సమయంలో చంద్రబాబు బీజేపీ తో పొత్తులో ఉన్నాడు. కాకపోతే బీజేపీ కి అద్భుతమైన పార్లమెంటు స్థానాలు రావడంతో తెలుగుదేశం కోరికలను తీర్చడంలో బీజేపీ వెనకడుగు వేసింది. దానితో ఆయన కూడా  విసుగు చెంది బయటకు వచ్చేసాడు. ఇక 2019 లో వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చింది.
వీరు విడిపోయిన రాష్ట్రం ఎన్నో వసతులు కావాలి , వాటికి డబ్బులు సమకూర్చండి అని కేంద్రాన్ని విన్నవించుకున్న వారు పెద్దగా పట్టించుకోలేదు. ఇక భాజాగా జరిగిన ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు దేశం , జనసేన , బీజేపీ మూడు పార్టీలు కలిసి పోటీ చేశాయి. ఇక ఈ పోటీలో తెలుగుదేశం పార్టీ కి 16 , జనసేన కు 2 ఎంపీ స్థానాలు వచ్చాయి.
ఇక చూస్తే కేంద్రంలో బీజేపీ పెద్ద ఎత్తున పార్లమెంటు స్థానాలు రాలేదు. దానితో ఈ సారి కచ్చితంగా బీజేపీ ఆంధ్ర ప్రదేశ్ కి బడ్జెట్ లో వరాలు కురిపిస్తుంది అని చాలా మంది అనుకున్నారు. అనుకున్నట్లుగానే తాజాగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కి భారీ మొత్తంలో నిధులను కేటాయించారు.
దీనితో ఆంధ్ర ప్రదేశ్ ప్రజలంతా ప్రస్తుతం చాలా హ్యాపీగానే ఉన్నారు. కానీ లెక్కల్లో చూపిన విధంగా డబ్బులు వస్తాయా అనే దానిపై కూడా కొంత మంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏదో బడ్జెట్లో ప్రకటించి ప్రస్తుతానికి కాలాన్ని వెల్లబుచ్చడానికి ఇలాంటి బడ్జెట్ను ప్రవేశపెట్టారా..? నిజంగానే ఇంత మొత్తంలో డబ్బులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది.
ఒక వేళ నిజంగానే మోడీ ప్రభుత్వం కనుక బడ్జెట్లో తెలిపిన విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధులను సమకూర్చినట్లు అయితే రాష్ట్రం అభివృద్ధిలో చాలా ముందుకు పోతుంది.
లేక ఇవన్నీ కల్లబొల్లి మాటలే అయినట్లు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మళ్ళీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లోనే కొనసాగవలసి ఉంటుంది. మరి మోడీ ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: