మోడీ మాయ: కడప ఉక్కు ఫ్యాక్టరీ కథేంటి? విభజన హామీల సంగతేంటి?

Pandrala Sravanthi
- బడ్జెట్ లో ఉక్కు పరిశ్రమకు కేటాయింపేది.!
- కడప ఉక్కుకు తుప్పుపట్టేనా.?
- రాష్ట్ర ప్రభుత్వమైనా నిర్మాణం చేపట్టేనా.?

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి బడ్జెట్ కేటాయింపుల్లో భాగంగా కేవలం అమరావతికి మాత్రమే 15 వేల కోట్లు కేటాయించారు. మిగతా  అభివృద్ధి పనులకు కేటాయిస్తామని చెప్పారు తప్ప కేటాయింపులు మాత్రం జరగలేదు. అలాంటి వాటిల్లో కడప ఉక్కు ఫ్యాక్టరీ పరిస్థితి మరి దారుణంగా తయారైంది. కొన్నేళ్ల కింద శంకుస్థాపన జరిగినటువంటి ఈ ఫ్యాక్టరీ ఇప్పటివరకు కూడా పనులు పూర్తిగా కాకపోవడం  చాలా దారుణం. కడప ఉక్కుకు నిధులు ఎప్పుడు కేటాయిస్తారు అనే వివరాలు చూద్దాం.  రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న విధంగా కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని కళ కలగానే మిగిలిపోతుంది. 

ఇప్పటికే కేంద్రం సహకరించక పోయినా ప్రైవేట్ వ్యక్తుల సహకారంతో నిర్మిస్తామని, ఇప్పటికే రెండు, మూడుసార్లు ప్రభుత్వాలు శంకుస్థాపనలు చేసిన అది అక్కడి వరకే పరిమితమైంది. జగన్ హయాంలో  కేంద్ర ప్రభుత్వం నిర్మాణంపై చేతులెత్తేయడంతో రాష్ట్ర ప్రభుత్వమే నిర్మించాలని ఆలోచనకు వచ్చింది. దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి  గతంలో మరోసారి శంకుస్థాపన చేసి ఫ్యాక్టరీని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఆయన పిరియడ్ అయిపోయే వరకు కూడా కనీసం ఉక్కు ఫ్యాక్టరీ వైపు కూడా చూడలేదు.  దీంతో సొంత జిల్లాలోనే కొంత అభివృద్ధి కూడా జరగలేదంటే మిగతా జిల్లాల పరిస్థితి ఏంటి అనేది చాలామంది చర్చించుకున్నారు. చివరికి జగన్ మోహన్ రెడ్డిని ఈ ఎన్నికల్లో దారుణంగా ఓడించారు.

చంద్రబాబు గెలిచిన తర్వాత అయినా ఈ ఉక్కు ఫ్యాక్టరీపై కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఏదైనా పురోగతి సాధిస్తారని చంద్రబాబుపై ఆశలు పెట్టుకున్నారు. ఈ బడ్జెట్ లో ఉక్కు ఫ్యాక్టరీకి తప్పకుండా కేటాయింపులు ఉంటాయని ఆశపడ్డారు. ఇది కూడా మూన్నాళ్ళ ముచ్చటగానే మారినట్టు తెలుస్తోంది. కనీసం కడప ఉక్కు ఫ్యాక్టరీ పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వం ఆరా కూడా తీయలేదు. ఇక కేటాయింపులు చేయడం అనేది కలే. అలాంటి ఈ తరుణంలో కడప ఉక్కు ఫ్యాక్టరీ ఎన్నో కష్టాలు పడుతోంది. దీనిపై ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు ఆలోచన చేసి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ప్రత్యేక నిధులు కేటాయింపులు చేసి ఉక్కు ఫ్యాక్టరీని పూర్తి చేస్తారా? లేదంటే నాకెందుకులే అనే సైలెంట్ గా ఉంటారా? అనేది ముందు ముందు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: