మోడీ మాయ: తెలంగాణ కోసం ఏపీకి అన్యాయం చేస్తున్న బీజేపీ ?

Veldandi Saikiran

* ప్రత్యేక హోదా ఐ ఇవ్వకుండా మోసం
* 10 ఏళ్లలో అన్ని రంగాల్లో బీజేపీ మోసం
* టీడీపీ, వైసీపీ ఎంపీలను గుప్పిట్లో పెట్టుకున్న బీజేపీ

 
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి తెలంగాణ రాష్ట్రంగా ఈ 10 సంవత్సరాలు దాటిపోయింది. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను విడగొట్టి... ఏపీకి హైదరాబాద్ తో కూడిన  తెలంగాణ... చేతులు దులుపుకున్న కాంగ్రెస్...  ఏపీలో అడ్రస్ లేకుండా పోయింది. అదే సమయంలో తెలంగాణ బిల్లుకు మద్దతు ఇచ్చి బిజెపి కూడా... చాలావరకు ఏపీలో నష్టపోయింది. కానీ ఇప్పుడిప్పుడే... ఏపీలో పుంజుకుంటుంది బిజెపి పార్టీ.

అయితే... ప్రత్యేక తెలంగాణకు మద్దతు ఇచ్చి.. విభజన సరిగ్గా లేదని చాలాసార్లు ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. ఏపీకి అన్యాయం జరిగిపోయిందని పార్లమెంట్ వేదికగా ప్రకటించారు. విభజనను తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ ఏపీని మాత్రం ఎక్కడా కూడా ఆదుకోలేదు ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఏపీ ప్రజలను మాయ చేసి... వైసిపి అలాగే తెలుగుదేశం పార్టీ ఎంపీలను వాడుకుంటుంది.
 

కేంద్రంలో ఏ బిల్లు పెట్టినా వైసిపి అలాగే టిడిపి ఎంపీలు తమకు సపోర్ట్ చేసేలా... బిజెపి ప్రయత్నాలు చేస్తాం తప్ప.. ఆంధ్రప్రదేశ్ కు... ఇలాంటి ఉపయోగపడే పని చేయలేదు. ఇక ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే.. తెలంగాణ కూడా అడుగుతుందని... కేంద్రం వెనక్కి వెళ్తోంది. అయితే.. కేంద్రం ఇవ్వాలనుకుంటే ఏపీకి మాత్రమే ప్రత్యేక హోదా ఇవ్వవచ్చు. కానీ బిజెపి మనసులో ఆ ఆలోచన లేనట్లే కనిపిస్తోంది.
ఎప్పుడు చూసినా గుజరాత్ తప్ప... ఏపీ గురించి అస్సలు పట్టించుకోరు బిజెపి పెద్దలు.  తాజగా తెలంగాణ రాష్ట్ర బిజెపి నేతలు కూడా... ప్రత్యేక హోదాపై  కీలక వ్యాఖ్యలు చేసి.. పెను ప్రకంపనలు సృష్టించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే తెలంగాణకు అన్యాయం జరుగుతుందని... అందుకే మోడీ ఆ నిర్ణయం తీసుకోవడం లేదు అని  బిజెపి తెలంగాణ నేతలు అంటున్నారు. ఇలా తెలంగాణ కోసం ఏపీని అన్యాయం చేస్తున్నారని... ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కొత్త చర్చ మొదలైంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: