ఏపీ: వివేకా హత్య కేసులో కీలక అప్డేట్..?

FARMANULLA SHAIK
దివంగత నేత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక వ్యక్తి అయిన దస్తగిరి.. ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అప్రూవల్‌గా మారిన తనపై తప్పుడు సాక్ష్యం చెప్పాలంటూ వేధిస్తున్నారని తన పిటిషన్‌లో పేర్కొన్నాడు దస్తగిరి. కడప జైల్లో ఉండగా తనకు డబ్బు ఆశ చూపి తప్పుడు సాక్ష్యం చెప్పాలని ఒత్తిడి తీసుకువచ్చారని కోర్టుకు విన్నవించాడు. దస్తగిరి తరుఫున ప్రముఖ న్యాయవాది జడ sravan KUMAR' target='_blank' title='శ్రవణ్ కుమార్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">శ్రవణ్ కుమార్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. తమకు అనుకూలంగా సాక్ష్యం చెప్పకపోతే తన కుటుంబ సభ్యుల్ని చంపేస్తామని బెదిరిస్తున్నారంటూ వైఎస్ అవినాష్ రెడ్డి, అతని అనుచరులపై దస్తగిరి సంచలన ఆరోపణ చేశాడు.తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు మరో ట్విస్ట్ తిరిగింది. ఈ కేసులో నాలుగో నిందితుడిగా ఉన్న షేక్ దస్తగిరిని సీబీఐ కోర్టు నిందితుల జాబితా నుంచి తొలగించింది. ఈ కేసులో తనను సాక్షిగా పరిగణించాలని దస్తగిరి సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను సీబీఐ కోర్టు గురువారం విచారించింది. ఈ సందర్భంగా.. ఈ కేసులో తనను అప్రూవర్‌గా కోర్టు అనుమతించినందున నిందితుల జాబితా నుంచి తొలగించాలని దస్తగిరి కోరారు. అలాగే వివేకా హత్య కేసులో సాక్షిగా మాత్రమే పరిగణించేలా ఆదేశాలివ్వాలని కోరారు. ఇదే సమయంలో సీబీఐ కూడా తనను అభియోగపత్రంలో సాక్షిగా చేర్చినట్లు దస్తగిరి సీబీఐ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న సీబీఐ కోర్టు.. వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుల జాబితా నుంచి దస్తగిరిని తొలగిస్తున్నట్టు ప్రకటించింది.జైలు నుంచి బయటకు వచ్చిన దస్తగిరి ఇటీవల జరిగిన 2024 సార్వత్రిక ఎన్నికల్లోనూ పోటీ చేశారు. లాయర్ జడ sravan KUMAR' target='_blank' title='శ్రవణ్ కుమార్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">శ్రవణ్ కుమార్ నేతృత్వంలోని జై భీమ్రావు భారత్ పార్టీలో చేరి.. ఆ పార్టీ తరుఫున పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అయితే ఈ ఎన్నికల్లో దస్తగిరి ఘోరంగా ఓడిపోయారు. కేవలం 544 ఓట్లు సాధించిన షేక్ దస్తగిరి.. ఏడో స్థానంలో నిలిచారు. అయితే ఇప్పుడు వైఎస్ వివేకా హత్య కేసు కారణంగా మరోసారి వార్తల్లో నిలిచాడు. కోర్టు తీర్పు ప్రకారం వైఎస్ వివేకా హత్య కేసులో దస్తగిరిని నిందితుడిగా కాకుండా సాక్షిగా పేర్కొనాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: