కేకే సర్వే చూసి షాకయ్యా.. కేకేది సర్వే కాదు: ఆరా మస్తాన్ సెన్సేషనల్‌ కామెంట్స్..??

Suma Kallamadi

ఈసారి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ఎవరూ కూడా కచ్చితంగా అంచనా వేయలేకపోయారు. ఒక్కరు తప్ప ఆ ఒక్కరే కేకే. టీడీపీ కూటమి 175 సీట్లకు గాను 161 సీట్లను గెలుచుకుని క్లీన్ స్వీప్ చేస్తుందని కేకే ఎగ్జిట్ పోల్స్ సర్వే తెలియజేసింది. ఇదే నిజమైంది దాంతో అందరూ ఆశ్చర్యపోయారు. జనసేన, టీడీపీ ఎన్ని సీట్లు గెలుచుకుంటాయో కచ్చితంగా అంచనా వేసి కేకే సంచలనం సృష్టించాడు. వైసీపీ 14 అంతకంటే తక్కువ సీట్లకే పరిమితం అవుతుందని చెప్పాడు అదే నిజమయింది. అయితే ఎప్పుడూ ఆరా మస్తాన్ సర్వే ఇంచుమించు కరెక్ట్ సర్వే లేదా ప్రిడిక్షన్స్ చేస్తుంది. కానీ ఈసారి ఆరా మస్తాన్ సర్వే పూర్తిగా అబద్ధం అయిపోయింది. 

 ఇటీవల ఆరా మస్తాన్ ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూ కి వచ్చి కేకే సర్వే గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆయన మాట్లాడుతూ తాను కేకే సర్వే చూసి షాక్ అయ్యానని, కచ్చితంగా ప్రిడిక్ట్ చేసిన అతన్ని అభినందించాల్సిందే అని చెప్పుకొచ్చారు. అయితే కేకే సర్వే మెకానిజం, శాంపుల్స్ గురించి అక్కడ ప్రస్తావించలేదని గుర్తు చేశాడు. 

"తాను కేవలం 40 నియోజకవర్గాల్లోనే సర్వే చేశాను అని చెప్పాడు మిగతా దాంట్లో సర్వే నిర్వహించలేదని, జస్ట్ ఫీడ్ బ్యాక్ తీసుకున్నానని కేకే తెలియజేశాడు. కానీ తాను ఫలానా నియోజకవర్గాల్లో ఫలానా మొత్తంలో శాంపుల్స్ తీసినట్లు చెప్పలేదు. ప్రీపోల్, పోస్ట్ పోల్ ఫలితాలను కూడా బయట పెట్టలేదు. అతను ఏ సర్వే మెకానిజం ఫాలో కాలేదు కాబట్టి అతనిది జస్ట్ ఒక అంచనా మాత్రమే. ఏదో స్లీపర్ సేల్స్ అనే పదం కూడా వాడాడు. చివరికి మాత్రం తనది సర్వే కాదని అతని ఒప్పుకున్నాడు. కానీ మేము ఒక సర్వే మెకానిజం ఫాలో అయ్యాం. తెలంగాణ ఏపీ రెండు రాష్ట్రాల్లోనూ ఆ మెకానిజాన్ని వదులుకోలేదు." అని ఆరా మస్తాన్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: