'కుప్పం' సెకండ్ పార్ట్ షురూ!

Suma Kallamadi
కుప్పం పేరు ఇటీవల ఏపీలో జరిగిన ఎన్నికల ముందు బాగా వినపడింది. కుప్పంలో చంద్రబాబును ఓడిస్తామని గత వైసిపి నేతలు ప్రగల్బాలు పలికిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ తరుణంలోనే కుప్పం పేరు హాట్ టాపిక్ గా మారింది. కుప్పానికి చంద్రబాబుకి విడదీయలేని అనుబంధం ఉంది. చంద్రబాబు గత 40 ఏళ్ల రాజకీయంలో విజయం దక్కించుకుంటున్న ఏకైక నియోజకవర్గం అది. ఈ నేపథ్యంలోనే గత వైసిపి ప్రభుత్వం కుప్పం నియోజకవర్గాన్ని చాలా సీరియస్ గా తీసుకుంది. ఈ క్రమంలో శపథాలు కూడా చేశారు. అయితే ఫలితం అందరికీ తెలిసిందే.
వైసీపీ నాయకులు ఎన్ని కుయుక్తులు పన్నిన, కుప్పం ప్రజలు చంద్రబాబుకే జై కొట్టారు. పైగా వైసిపికి ఏపీ ప్రజలు నామరూపాలు లేకుండా చేశారు. ఈ క్రమంలో వైసిపి కథ ముగిసిపోయిందని అంతా అనుకున్నారు. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను గమనిస్తే అలా కనిపించడం లేదు. కుప్పం కథలో సెకండ్ పార్ట్ మొదలైంది అంటూ ఊహా గానాలు మొదలయ్యాయి. అవును, విషయం ఏమిటంటే... నియోజకవర్గంలో చంద్రబాబుని ఓడించే బాధ్యతను జగన్ పెద్ది రెడ్డి రామచంద్ర కి అప్పగించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు కూడా అదే యాక్షన్ ప్లాన్ అమలు కాబోతున్నట్టు గుసగుసలు వినబడుతున్నాయి.
రాబోయే రోజుల్లో నైనా కుప్పం వేదికగా చంద్రబాబును ఎలాగన్నా ఓడించాలని వైసీపీ అధిష్టానం కలలు కంటున్నట్టు సమాచారం. మదనపల్లి సబర్ రిజిస్టార్ ఆఫీసులో జరిగిన అగ్ని ప్రమాదం కావచ్చు, స్థానిక భూముల పత్రాలు తగలబడడం కావచ్చు, అక్రమ కట్టడాలు అని చెప్పి నిర్మాణంలో ఉన్న భవంతులను కూల్చడం కావచ్చు... ఇటువంటి పరిణామాలను పరిశీలనలోకి తీసుకొని పెద్దిరెడ్డి స్థానికంగా రాజకీయం షురూ చేశారని గుసగుసలు వినబడుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రస్తుతం చిత్తూరు టిడిపి నాయకులు ఎక్కువగా ఈ విషయం పైన ఫోకస్ చేస్తున్నారని వినికిడి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: