బాబుకి షాకిచ్చిన వైవీ సుబ్బారెడ్డి... కీలక ఆదేశాలు!

Suma Kallamadi
వై వి సుబ్బారెడ్డి గురించి తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గత ప్రభుత్వ హయాంలో కీలకనేతగా వ్యవహరించిన వై వి సుబ్బారెడ్డి తనదైన మార్క్ పాలనతో వైసిపి పెద్దమనుషుల మనసులను దోచుకున్నాడు. ఈ క్రమంలో ఆయనకి జగన్మోహన్ రెడ్డి చాలా గట్టిగానే బందోబస్తుని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఇటీవల ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో మాజీ మంత్రుల సెక్యూరిటీ బలగాన్ని కుదిరించడం జరిగింది. ఇక్కడే వచ్చింది అసలు చిక్కు... ఈ విషయంలో వై వి సుబ్బారెడ్డి కొన్నాళ్ల క్రితం హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది.
తన భద్రతను 2+2 నుండి వన్ ప్లస్ వన్ కి కూటమి ప్రభుత్వం కుదించిందని ఆరోపిస్తూ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దాంతో తాజాగా హైకోర్టు తీర్పునిస్తూ కూటమి ప్రభుత్వానికి వై వి సుబ్బారెడ్డి భద్రత 2 + 2 ని కంటిన్యూ చేయవలసిందిగా ఆజ్ఞాపించారు. ఈ తీర్పు ఎప్పుడైతే వెలువడిందో కూటమి పెద్దమనుషుల మనసులు కుదేలయ్యాయి. ఎంపీగా ఆయనకు 2 + 2 భద్రత అనేది చాలా అత్యవసరం అన్నట్టు ఆయన తరపు న్యాయవాదులు వాదించగా హైకోర్టు తాజా తీర్పుని వెలువరించింది.
ఈ నేపథ్యంలోనే ఓ నాలుగు వారాలు పాటు ఆయనకి 2 + 2 భద్రతని కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పు వెలువడిన తర్వాత ఏపీ పోలీసు యంత్రాంగం మొదట ఉపసంహరించుకున్న 2 + 2 కేటగిరి సెక్యూరిటీని వై వి సుబ్బారెడ్డి కి కొనసాగించేలా చర్యలు తీసుకోవడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గత ప్రభుత్వ హయాంలో 2 ప్లస్ 2 కేటగిరి భద్రత కలిగిన సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భద్రతాంశాలు వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం  వీరి భద్రతను కూడా కూటమి ప్రభుత్వం కుదిరించడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: