కేసీఆర్‌, రేవంత్‌ రెడ్డి జీతాలు కట్‌ ?

Veldandi Saikiran
కేసీఆర్‌, రేవంత్‌ రెడ్డి జీతాలు కట్‌ చేయాలని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి డిమాండ్‌ చేశారు. అసెంబ్లీకి రాని వారి జీతాలు కట్‌ చేస్తేనే బుద్ది వస్తుందని హెచ్చరించారు. ఇవాళ మీడియాతో కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి మాట్లాడుతూ.. 119 ఎమ్మెల్యేల్లో 50 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావడానికి బద్దకిస్తున్నారని ఆగ్రహించారు. అసెంబ్లీకి రాని వ్యక్తి గురించి సిఎం ఎందుకు చర్చించడం ? అని ప్రశ్నించారు కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి. ముఖ్యమంత్రి ఇప్పుడు ఏం చేస్తారో చెప్పాలన్నారు.
అసెంబ్లీ రాని వ్యక్తులు మీ జీతాలు తిరిగి ఇచ్చేయండి ? అంటూ ఫైర్‌ అయ్యారు. అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేల వేతనాలు కట్ చేయాల్సిందేనని డిమాండ్‌ చేశారు కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి.  నేను ఒక్కరోజు రాకపోయినా నా జీతం తిరిగి ఇచ్చేస్తానన్నారు. ఇది రాజాసింగ్, రేవంత్, కెసిఅర్ అందరికీ వర్తించాలని కోరారు కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి.  రెండు లక్షల 75 వేల రూపాయల వేతనాలు తీసుకుంటున్న ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావడం లేదని ఆగ్రహించారు.
ప్రజాప్రతినిధులు మిత్రులైతే... ప్రజలు శత్రువులా? అంటూ ఫైర్‌ అయ్యారు. ప్రజలకు ఒరిగేది ఏమీ లేదని...  సినిమాలో సిరియస్ సీన్ నడుస్తుంటే... జోక్ వేసినట్లు సభలో సిరియస్ చర్చ జరుగుతుంటే జోక్ లు వేసుకుంటున్నారని మండిపడ్డారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు రోజుకు 10 లక్షల వేతనాలు తీసుకుంటున్నారని... ఎమ్మెల్యేగా ఎందుకు వచ్చినా అని బాధపడుతున్నట్లు ఉందని తెలిపారు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రద్దు కోసం పోరాటం చేశాను.   పావలా వడ్డీ కోసం పోరాటం చేశాను.. ఎమ్మెల్యేగా లేకున్నా పోరాటాలు చేస్తే సంతృప్తి లభించిందని వివరించారు.  అసెంబ్లీలో ఉదయం టిఫిన్లు, మధ్యాహ్నం లంచ్ లో మటన్, చికెన్, ఫిష్ తిని వెళ్తున్నారని.. ఎమ్మెల్యేలు  బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని నిప్పులు చెరిగారు కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి. ఇక నైన తెలంగాణ అసెంబ్లీకి రావాలని కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

kcr

సంబంధిత వార్తలు: