టీజీ బడ్జెట్ 2024: రాష్ట్ర బడ్జెట్లో ఏ ఏ రంగానికి ఎన్ని కోట్లంటే.?

Pandrala Sravanthi
కేంద్రం పెట్టిన బడ్జెట్లో తెలంగాణ కి చాలా అన్యాయం జరిగిందని ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం తో పాటు బీఆర్ఎస్ నాయకులు కూడా బిజెపి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. పార్లమెంటు ఎలక్షన్స్ లో ఎనిమిది ఎంపీ సీట్లు గెలిపిస్తే ప్రజలకు తెలంగాణ బిజెపి నాయకులు తీసుకు వచ్చింది గాడిద గుడ్డు అంటూ విపక్షాలు ఎద్దేవా చేస్తున్నారు. ఈ నేపథ్యం లోనే ఈరోజు మధ్యాహ్నం తెలంగాణ బడ్జెట్ ని అసెంబ్లీ లో ప్రవేశపెట్టారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఇక ఇందులో ఏ ఏ సంక్షేమ పథకాల కు ఎన్ని కోట్ల బడ్జెట్ నిధులు కేటాయించబోతున్నారు అనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 

ఇప్పటికే బట్టి విక్రమార్క 2.90 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టబోతున్నట్టు సమాచారం అందుతుంది. ఇందులో ఏ పథకానికి ఎంత కేటాయిస్తారు అనేది చూస్తే.. 2,91, 159 కోట్ల తెలంగాణ బడ్జెట్లో రెవెన్యూ వ్యయం 2, 20,945 కోట్లు, మూలధన వ్యయం 33,487 కోట్లు. ఈ బడ్జెట్ లో సంక్షేమానికి 40 వేల కోట్లు కేటాయించారు.. సాగు నీటి రంగానికి 26 వేల కోట్లు, వ్యవసాయ రంగానికి 72,659 కోట్లు, జిహెచ్ఎంసి లోని మౌలిక వసతులకు 3050 కోట్లు, గృహ జ్యోతి పథకానికి 2418 కోట్లు, హైదరాబాద్ అభివృద్ధి కి 10 వేల కోట్లు, పంచాయతీ రాజ్ కు 29,816 కోట్లు కేటాయించినట్లు తెలుస్తోంది. 

మూసి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకు 1500 కోట్లు, మెట్రో విస్తరణకు 100 కోట్ల ను తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ కేటాయించినట్లు తెలుస్తోంది. వైద్య ఆరోగ్య శాఖకు 11468 కోట్లు, విద్యుత్ రంగానికి 16,410 కోట్లు, మైనార్టీ సంక్షేమానికి 3003 కోట్లు, బీసీ సంక్షేమానికి 9200 కోట్లు, అడవులు పర్యావరణానికి 1064 కోట్లు, పరిశ్రమల శాఖ కు 2672 కోట్లు, ఐటీ శాఖకు 774 కోట్లు, సాగు నీటిపారుదలకు 22,301కోట్లు  కేటాయించారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: