జగన్: తనను చంపేయండంటూ కీలక వ్యాఖ్యలు చేసిన మాజీ సీఎం..!

FARMANULLA SHAIK
ఏపీ ఎన్నికల ఫలితాల తర్వాత చోటు చేసుకుంటున్న పరిణామాలు విపక్ష వైసీపీ అధినేత జగన్ ను అనివార్యంగా ఇండీ కూటమి వైపు నెట్టేస్తున్నాయి. ఐదేళ్లుగా మోడీతో జట్టు కట్టినా ఏపీలో మాత్రం పరిస్ధితులు తారుమారు కాగానే బీజేపీ తనకు దూరంగా జరిగిపోవడం, తన ప్రత్యర్థి చంద్రబాబు చెప్పినట్లు ఆడుతుండటంతో వచ్చే ఐదేళ్లలో ఏం జరగబోతోందో జగన్ ముందుగానే అంచనా వేసుకుంటున్నారు.ఎ న్నికల్లో చిత్తుచిత్తుగా ఓడిపోయి నెలరోజులు అయిందో..? లేదో..? అప్పుడే జగన్మోహన్ రెడ్డి హడావుడి మొదలుపెట్టేశారు. ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతలు క్షీణించాయని..వైసీపీ కార్యకర్తలను రాష్ట్రంలో బతకనీయడం లేదంటూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి.. ఏకంగా ఢిల్లీ వేదికగా ధర్నా చేసిన సంగతి తెలిసిందే.చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 50 రోజులైనా గడవలేదు.. ఈ లోపే రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శాంతి భద్రతలు కాపాడే విషయంలో ఘోరంగా విఫలమైంది అంటూ వైసీపీ హడావుడి ప్రచారం మొదలు పెట్టేసింది. మొదటి రోజు నుంచే ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెంచే వ్యూహంతో వైసీపీ ముందుకు వెళుతుంది. ఏదైనా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పాలన గాడిలో పడాలంటే.. కనీసం 6 నెలల నుంచి ఏడాది పడుతుంది. కేవలం నెల రోజులకు వ్యవధిలోనే ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడం ద్వారా వైసీపీ చేస్తున్న హడావుడి ప్రచారాన్ని ప్రజలు చీకొడుతున్నారు.

ఏపీలో వైసీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్న క్రమంలో మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను చంపాలనుకుంటే.. చంపేయండి అని అన్నారు.అంతేగానీ మీకు ఓటు వేయలేదనే కారణంతో అమాయకులైన ప్రజలు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని ఇలా దాడులు చేయడం కరెక్ట్ కాదు అని అన్నారు. కాగా ఈ దాడులను నిరసిస్తూ జగన్ తన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ముఖ్య నేతలతో ఢిల్లీలో నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే. టీడీపీ రాజకీయ కక్షతోనే ఎలాంటి ఘటనలకు పాల్పడుతుందని ఆరోపించారు. తమ పార్టీని లేకుండా చేయాలని టీడీపీ నేతలు కుట్రలు చేస్తున్నారని అన్నారు.ఈ నేపథ్యంలో నిన్న ఢిల్లీలో ధర్నా చేసిన వైసిపి అధినేత జగన్ ఎన్ డి టీవీ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. 'నన్ను చంపాలనుకుంటే చంపేయండి' కానీ మీకు ఓటు వేయని వారిని, మా కార్యకర్తలను ఎందుకు లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడుతున్నారు. మీరు నన్ను టార్గెట్ చేస్తే చేసుకోండి నాపై కోపం ఉంటే నన్ను చంపేయండి అని వ్యాఖ్యానించారు. తాను అధికారంలో ఉన్నప్పుడు ఎన్నడూ ప్రతిపక్షాలపై దాడులు చేయలేదని జగన్ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: