ఏపీ: ఫ్రీ గ్యాస్ సిలిండర్లపై కూటమి క్లారిటీ..!

Divya
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫ్రీ గ్యాస్ సిలిండర్లు ఇస్తామని ఎన్నికల ముందు తెలియజేశారు.. అయితే ఇప్పటికి కూటమి అధికారంలోకి వచ్చి 50 రోజులు అవ్వ వస్తున్నా కూడా వీటి పైన ఇంకా ఎలాంటి స్వస్థత ఇవ్వలేదు.. ప్రస్తుతం ఖజానా ఖాళీగా అయిపోయిందని కూటమి ప్రభుత్వ పెద్దలు కూడా తెలియజేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కోలుకోవడానికి మరొక రెండు సంవత్సరాలు పడుతుంది అనే విధంగా కూడా తెలియజేయడం జరిగింది. కానీ కూటమి అధికారంలోకి రావడానికి ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ హామీ కూడా చాలా కీలకంగా మారింది.

ధర రోజు రోజుకి పెరుగుతున్న నేపథ్యంలో మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా పేదలకు ఇస్తామని తెలియజేశారు. దీంతో ప్రజలు ఎప్పుడు ఇస్తారా అంటూ చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ లో ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ల విషయం పైన పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ క్లారిటీ ఇచ్చారు.. కూటమిలో పార్టీలు ఏడాదికి మూడు సిలిండర్లను ఉచితంగా ఇస్తామని హామీను కూడా ఇచ్చారు ఈ విషయంలో ఎలా ముందుకు వెళ్లాలనే విషయం పైన పరిశీలిస్తున్నామంటూ తెలియజేశారు నాదెండ్ల మనోహర్.

అంతేకాదు అన్ని విషయాలు ఆలోచించిన తర్వాతే పూర్తి వివరాలు వివరిస్తామని ఈ విషయంలో పేదింటి మహిళ కుటుంబాలకు కచ్చితంగా మంచి చేస్తామని తెలిపారు జనసేన పార్టీ మంత్రి నాదెండ్ల మనోహర్..అయితే దానికి ఎంత సమయం పడుతుంది ఎప్పుడు ఇస్తారు అన్నది విషయం మాత్రం తెలియజేయలేదు. ఇస్తామని మాత్రమే తెలియజేశారు. కొత్తగా ప్రభుత్వం అధికారం చేపట్టింది కాబట్టి కాస్త సమయం ఇవ్వాల్సి న అవసరం ఉందని దీంతో నాదెండ్ల మనోహర్ స్పష్టతతో ప్రస్తుతం మహిళలో కాస్త ఆందోళన తగ్గిందని చెప్పవచ్చు. ఇక అమ్మ ఒడి కూడా ఇంట్లో ఉండే ప్రతి పిల్లలకు కూడా ఇస్తామని నిన్నటి రోజున నారా లోకేష్ తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: