వైసీపీ వికెట్లు టపటపా: టైం చూసి జగన్ ను దెబ్బ కొట్టిన బాల శౌరి ?

Veldandi Saikiran
* మూడుసార్లు ఎంపీగా విజయం
* వైయస్సార్ కు వల్లభనేని బాల శౌరి వీరాభిమాని  
* ఎన్నికల కంటే ముందు వైసీపీ నుంచి జనసేన లో చేరిక
* జగన్ పై వ్యతిరేకత ముందే గ్రహించిన బాలశౌరి

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో... కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయింది. దీంతో జగన్మోహన్ రెడ్డి పార్టీ ప్రతిపక్షంలో కూర్చోవడం జరిగింది. అయితే మొన్నటి అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు... ఏపీలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. వైసీపీలో టికెట్ రానివారు... చాలామంది జనసేన లేదా తెలుగుదేశం పార్టీలో చేరారు. అలా వైసిపి నుంచి బయటికి వచ్చిన వారు 100కు 100%.. దాదాపు సక్సెస్ అయ్యారు.
 అలాంటి వారిలో పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి ఒకరు. ఎన్నికల కంటే ముందు.. జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చిన.. వల్లభనేని బాలశౌరి.. జనసేనలో చేరారు. ఈ తరుణంలోనే మచిలీపట్నం  ఎంపీగా జనసేన తరఫున విజయం సాధించారు వల్లభనేని బాలశౌరి. వాస్తవానికి బాలశౌరికి టికెట్ ఇచ్చేందుకు.. జగన్మోహన్ రెడ్డి.. కాస్త ఆలోచించారట. అలాగే జగన్మోహన్ రెడ్డి పై ఉన్న వ్యతిరేకతను బాలశౌరి కూడా ముందే గ్రహించారట.
 ఈ తరుణంలోనే టైం చూసి జనసేనలోకి జంప్ అయ్యారు. ఇప్పుడు ప్రభుత్వంలో  బాలశౌరి ఉండడం జరిగింది. బాలశౌరి.. వైయస్సార్ కు వీరాభిమాని. మొదటినుంచి కాంగ్రెస్ లోనే బాలశౌరి పనిచేశారు. 2004 సంవత్సరంలో తెనాలి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి మొదటిసారిగా ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత వరుసగా ఓడిపోవడం జరిగింది. ఇక వైసిపి పార్టీ ఏర్పాటు అయిన నేపథ్యంలో.. వైయస్సార్ కోసం.. జగన్ పార్టీలోకి వచ్చారు.
2014 లో ఎంపీగా టికెట్ ఇచ్చినా కూడా వైసిపి తరఫున గెలవలేకపోయారు బాలశౌరి. కానీ 2019 ఎన్నికల్లో మచిలీపట్నం నియోజకవర్గం  వైసీపీ ఎంపీగా బాల సౌరి విజయం సాధించి సక్సెస్ అయ్యారు. అయితే.. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి పైన ఉన్న వ్యతిరేకతను గ్రహించిన బాలశౌరి.. మొన్నటి ఎన్నికల కంటే ముందు అంటే జనవరిలో జనసేనలో చేరి... ఇప్పుడు మళ్లీ మచిలీపట్నం ఎంపీగా విజయం సాధించారు. అన్నం పెట్టిన వైసీపీని ఓడించి.. జనసేన జెండాను ఎగరవేశారు  వల్లభనేని బాలశౌరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: