వైసీపీ వికెట్లు టపాటపా: 'లావు' తోనే పతనం ప్రారంభం.. పసిగట్టని జగన్...?

FARMANULLA SHAIK
* సిట్టింగ్ల మార్పుపై మొండిగా వ్యవహారించిన జగన్.!
* హుకుం జారీ చేస్తే ఇక అంతే అనేలా జగన్ శైలి.?
* పద్దతి మారకుంటే వైసీపీ ఫ్యూచర్ ఇంకా కష్టమే.!
( ఆంధ్రప్రదేశ్-ఇండియాహెరాల్డ్ ): 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 151 సీట్లతో భారీ విజయాన్ని దక్కించుకున్న వైసీపీ ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూడా 175/175 సీట్లు గెలుస్తామనే ధీమాతో ఉన్న జగన్కూ రాష్ట్ర ప్రజలు షాక్ ఇచ్చి11 సీట్లకు మాత్రమే పరిమితం చేశారు.దాంట్లో భాగంగానే ఈ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం 164 సీట్లతో భారీ విజయం సాధించి జూన్ నెల 12వ తేదీన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.అయితే అప్పటి నుండి వైసీపీ పార్టీ నేతలకు తెలియని ఒక భయమేదో వెంటాడుతున్నట్లు అనిపిస్తుంది దీనిని గ్రహించిన కొందరు వైసీపీ నేతలు పార్టీ నుండి జంపింగ్స్ చెయ్యడం స్టార్ట్ చేసారు.వారిలో మొదటివ్యక్తిగా నిలిచేది మాత్రం రావెల కిశోర్ బాబు గారు.దళితుల సంక్షేమం ఒక్క వైసీపీ ప్రభుత్వంతోనే సాధ్యం అని ఆయన వైసీపీలో చేరినట్లు తెలుస్తోంది.దీనికి కారణం ముఖ్యంగా గత ఎన్నికలకు ముందు జగన్ మోహన్ రెడ్డి అడ్డగోలుగా సిట్టింగ్‌లను మార్చడం ఒకటైతే కొంతమంది నోటి దురుసు వల్ల పార్టీకీ చెడ్డ పేరు జనాల్లోకి వెళ్ళిపోయింది.అయితే వైసీపీ ప్రభుత్వం ఓటమి తర్వాత చిన్నగా చాలా మార్పులు చోటుచేసుకుంటున్నాయి.వాటిలో భాగంగానే జగన్ వల్ల నొచ్చుకున్న ఎంతోమంది ఇప్పుడు వైసీపీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. మొన్నటిమొన్న గుంటూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాజీ ఎమ్మెల్యే మద్దాలి గిరి రాజీనామా చేశారు.అలాగే తాజాగా అదే గుంటూరు జిల్లాలో పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య వైసీపీపై తీవ్ర విమర్శలు చేస్తూ రాజీనామా చేశారు.
వైసీపీ హయాంలో పదవులు అనుభవించిన ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రస్తుతం చాలా మంది పార్టీ ఫిరాయింపు పనుల్లో ఉన్నట్లు తెలుస్తుంది. వారిలో మాజీ మంత్రి రావేల కిషోర్, డొక్కా మాణిక్యవరప్రసాద్,మద్దాలి గిరి, కిలారి రోశయ్య అయితే ఎన్నికల ముందు పార్టీమారి టీడీపీలో చేరిన నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మరలా భారీ విజయాన్ని అందుకున్నారు.అయితే లావు పార్టీ మారడంతోనే వైసీపీ పతనం ఆరంభం అనే తెలుస్తుంది. ఎందుకంటె లావు కాంట్రవర్సిలు ఏమి లేని ఎంపీగా ఆయనకు మంచి పేరుంది అలాంటిది ఆయన పార్టీ మారేలాగా  చేసిన వైసీపీ చేష్టల్ని బట్టి వైసీపీ తన ఓటమిని గ్రహించలేకపోయింది.ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకొని జగన్ కూటమి ప్రభుత్వంపై నిప్పులు చీమ్ముతున్నారు. దాంట్లో భాగంగానే ఢిల్లీలో వైసీపీ అధినేత జగన్ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేస్తున్న వేళ ఇక్కడ పార్టీ నేతలు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చేజారిపోతున్నారుఇంకోవైపు ఢిల్లీలో జరిగిన జగన్ ధర్నాకు ఇద్దరు ఎమ్మెల్సీలు కూడా హాజరు కాని సంగతి తెలిసిందే. దీంతో వారు కూడా టీడీపీలో చేరడానికి రెడీ అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: