వైసీపీ తప్పిదాలకు షాకిస్తున్న ఎమ్మెల్సీలు? వైఖరి మారకుంటే కష్టం?

Purushottham Vinay

• గత వైసీపీ అధికారంలో ఎమ్మెల్సీలకు కరువైన గుర్తింపు! 

• అవమానంతో టీడీపీపై మొగ్గు చూపుతున్న ఎమ్మెల్సీలు!


ఆంధ్రప్రదేశ్ - ఇండియా హెరాల్డ్: సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించిన తెలుగుదేశం పార్టీ, జనసేన, బిజెపి కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో పూర్తిస్థాయి మెజారిటీతో కొనసాగుతోన్న సంగతి తెలిసిందే.శాసనసభలో ఏ బిల్లయినా కూడా సులభంగా పాస్ చేసుకునే బలం ప్రస్తుతం టీడీపీ కూటమికి ఉంది. గత 5 సంవత్సరాల అధికారాన్ని అనుభవించిన వైసీపీ అత్యంత దారుణ పరాభవంతో కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితమైంది. అయితే, వైసీపీకి శాసనమండలిలో బాగా బలం అయితే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఏవైనా కీలక బిల్లులను పాస్ చేయించుకోవాలంటే శాసన మండలిలో కూడా ఆమోదం  అనేది తప్పనిసరిగా ఉండాలి. ఇక ప్రస్తుత పరిస్థితుల్లో శాసనమండలిలో వైసీపీకి బలం ఉండడంతో అధికార కూటమి ప్రభుత్వానికి కొంత ఇబ్బంది తప్పదన్న విశ్లేషణలు కూడా ఉన్నాయి.ఈ నేపథ్యంలోనే టీడీపీ కూటమి నేతలు శాసనమండలంలో కూడా బలం పెంచుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్న పలువురు ఎమ్మెల్సీలపై కూడా తెలుగు దేశం పార్టీ దృష్టి పెడుతున్నట్లు తెలుస్తోంది. 


గడిచిన ఐదేళ్లు వైసీపీ అధికారం ఉన్నా కానీ తమను ఏమాత్రం కనీసం పట్టించుకోలేదన్న భావన చాలా మంది ఎమ్మెల్సీలలో ఉంది. అలాంటి వారంతా కూడా ఇప్పుడు అధికార తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అలాంటి వారిపైన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టి చేర్చుకునేందుకు ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది.వైసీపీ చేసిన తప్పిదాల వల్ల ఎమ్మెల్సీలు ఇలా షాకులు ఇస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్సీలుగా ఉన్నప్పుడు కనీసం గౌరవం, గుర్తింపు దక్కకపోవడం పట్ల అవమాన భారంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అందుకే ఎమ్మెల్సీలు ప్రస్తుత అధికార తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సంసిద్ధులవుతున్నారు. అందుకే తమకు సన్నిహితంగా ఉండే మంత్రులు, ఎమ్మెల్యేల ద్వారా టిడిపిలో చేరేందుకు రాయబారాలను పంపుతున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్సీలు ఈ మేరకు ప్రయత్నాలు కూడా చెయ్యడం జరిగింది. తెలుగు దేశం పార్టీ యొక్క మంత్రులను కలిసి తమ ఆలోచనలను వారికి తెలియజేస్తున్నారు. ఇప్పటికే కొందరు ఎమ్మెల్సీలు తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక నేతలు, మంత్రులను కలిసి మాట్లాడినట్లు తెలిసింది. వైసీపీ తన వైఖరి మార్చుకోపోతే ఇక పార్టీ బాగు పడటం చాలా కష్టం అని తెలుస్తుంది. మరి చూడాలి వైసీపీలో మార్పు వస్తుందో లేదో..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: