ఏపీ: హామీల్లో భాగంగా మరో పధకంపై కదలిక వచ్చిందే...?

FARMANULLA SHAIK
ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు రాష్ట్రాభివృద్ధిపై ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.ఏపీ శాసనసభలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి.సూపర్ సిక్స్ హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి పార్టీలు...హామీలు అమలుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నాయి. ఒక్కొక్కటిగా అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని మంత్రులు అసెంబ్లీ తెలిపారు. ఈ సందర్భంగా మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ అంశం తెరపైకి వచ్చింది. దీనిపై మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందించారు.ఈ క్రమంలో ఏపీ మహిళలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం పై పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు. నేడు (బుధవారం) ఆయన ఏపీ అసెంబ్లీలో మాట్లాడుతూ..ఎన్నికల సమయంలో ఎన్డీయే కూటమి ఇచ్చిన హామీకి ప్రభుత్వం కట్టుబడి ఉందని అసెంబ్లీలో చెప్పారు. సంబంధిత శాఖలతో చర్చించుకుని త్వరలో ఈ పథకం పై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.కాగా, ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామని మేనిఫెస్టోలో ఎన్డీయే హామీ ఇచ్చింది.ప్ర స్తుతం ఉచిత గ్యాస్ సిలెండర్‌లను రాష్ట్ర ప్రభుత్వం అందించడం లేదని మంత్రి నాదేండ్ల మనోహర్ అన్నారు. అయితే 2016 నుంచి 24 వరకూ ప్రధాన మంత్రి ఉజ్వల యువజనం పథకం కింద కొంతమందికి ఇస్తున్నారన్నారు.కేంద్ర ప్రభుత్వం పీఎంయూఐ పథకం కింద మొదటి ఉచిత ఎల్పీజీ కనెక్షన్, సిలండర్ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఎన్డీఏ కూటమిలో భాగంగా మా మ్యానిఫెస్టోలో మహిళలకు ఉచిత గ్యాస్ సలెండర్‌లకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఉచిత గ్యాస్ సిలెండర్ గురించి త్వరలో నిర్ణయం తీసుకొని వివిధ శాఖలతో చర్చించి సభా ముఖంగా మరోసారి వివరాలు తెలియజేస్తామన్నారు. రాష్ట్రంలో త్వరలోనే 674 కోట్లు ధాన్యం బకాయిలు రైతులకు అందిచాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. గతంలో ఉన్న రైతు భరోసా కేంద్రాలను రైతు సహయ కేంద్రాలుగా మార్చుతున్నామని నాదేండ్ల మనోహర్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: