జగన్: ఢిల్లీలో ముగిసిన దీక్ష.. ఆ పార్టీ నేతల మద్దతు.. ఎవరెవరంటే..?

Divya
ఢిల్లీలో వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వైసీపీ కార్యకర్తలు పైన జరుగుతున్న అన్యాయాల పైన ఆంధ్రప్రదేశ్లో భాగంగా ఢిల్లీలో ఈరోజు నిరాహార దీక్ష కూడా చేశారు. దేశవ్యాప్తంగా ఎనిమిది పార్టీల నేతలకు మద్దతు కూడా వైసిపి పార్టీకి లభించినట్లు తెలుస్తోంది. దేశ రాజధానికి ఢిల్లీలో జంతర్ మంతర్ వేదికగా వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి నిరాహార దీక్ష కూడా చేపట్టారు.. ఈ దీక్షకు సైతం మహారాష్ట్ర నుంచి ఉద్ధవ్ శివసేన, అలాగే పంజాబ్ నుంచి అమ్ ఆద్మీ పార్టీ, వెస్ట్ బెంగాల్ నుంచి టిఎంసి, తమిళనాడు నుంచి ఏఐడీఎంకే ఇలా పలు రకాల పార్టీ నేతలు సైతం వైసీపీ పార్టీకి మద్దతు పలకడం జరిగింది.

వీరే కాకుండా జేఎంఎం, ఇండియన్ యూనియన్ ముస్లిజ్ లీగ్, వీసీకే పార్టీలు సైతం మద్దతు పలికాయి ఆంధ్రప్రదేశ్లో జరిగిన పరిణామాల పైన ఆందోళన వ్యక్తం చేస్తూ శివసేన ఉద్యమ వర్గం ఎంపీ సంజయ్ రావు మాట్లాడుతూ ఆంధ్రాలో రక్తపు మరకలు పారుతున్నాయంటూ అక్కడి నేతలు  ఒక క్షణం కూడా ప్రభుత్వంలో ఉండే అర్హత లేదంటూ కూడా ఫైర్ అయ్యారు. ఏపీలోనే కాదు తమిళనాడులో కూడా శాంతి భద్రతల పరిస్థితి చాలా ఘోరంగా ఉందంటూ ఏఐడీఎంకే ఎంపీ చంద్రశేఖర్ సైతం తెలియజేశారు.

తమ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను చూసే జగన్కు కూడా మద్దతు తెలిపేందుకే ఢిల్లీ వరకు వచ్చామంటూ తెలిపారు. ఉత్తరాంధ్రప్రదేశ్లో ఈసారి లోక్సభ ఎన్నికలలో కీలకంగా పోషించిన సమాజ్వాది పార్టీ నేత కూడా కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. జగన్ ధర్నా చేపట్టిన ఈ శిబిరానికి సైతం వచ్చి మద్దతుగా తెలియజేశారు యూజీ సీఎం.. అధికారం ఎవరికి శాశ్వతం కాదని ఆయన కార్యకర్తలను హింసించడం సరైన పద్ధతి కాదు అంటూ అఖిలేష్ యాదవ్ కూడా తెలియజేశారు.. ఇలా వీరే కాకుండా చాలామంది నేతలు ముఖ్యమంత్రులు కూడా మాట్లాడారు. వైయస్ జగన్ మాట్లాడుతూ ఏపీలో హింసకాండ చెలరేగిందని తనకు మద్దతుగా పలికిన ఎనిమిది జాతీయ పార్టీలకు సైతం కృతజ్ఞతతో ఉంటానంటూ తెలిపారు. అధికారం ఎవరికి శాశ్వతం కాదు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి అంటూ ఫైర్ అయ్యారు ..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: