ఢిల్లీలో వైసీపీకి షాక్.. జగన్ ధర్నాకు బ్రేక్ ?

Veldandi Saikiran
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఢిల్లీలో ధర్నా చేయాలని నిర్ణయం తీసుకున్న జగన్మోహన్ రెడ్డికి.. అక్కడి పోలీసులు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. ఢిల్లీలో ఉన్న ఏపీ భవన్ , జంతర్ మంతర్ దగ్గర తీవ్రమైన ఆంక్షలు విధించారు పోలీసులు. అంతేకాదు ఏపీ భవన్ గేట్లు కూడా ఇప్పటికే అధికారులు మూసి వేయడం జరిగింది.
ఏపీలో జరుగుతున్న హత్యలు, వైసిపి నేతలపై దాడుల నేపథ్యంలో... దానికి నిరసనగా... ఇవాళ వైసీపీ ధర్నాకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగానే వైయస్ జగన్మోహన్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఢిల్లీకి వచ్చారు. ఇవాళ ఉదయం 10:00 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర.. ధర్నా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ప్రకటన కూడా చేశారు.
 అయితే వైసిపి నేతలందరూ ఢిల్లీకి చేరిన నేపథ్యంలో.. ఏపీ భవన్ దగ్గర ఆంక్షలు విధించారు పోలీస్ అధికారులు.  వైయస్ జగన్మోహన్ రెడ్డి అలాగే వైసిపి ప్రజాప్రతినిధులు ధర్నాలు చేయకుండా నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నారు. జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసేందుకు సిద్ధమవుతున్న వైసిపి పార్టీకి.. ఊహించని షాక్ ఇస్తూ.... అక్కడ ఆంక్షలు విధించారు పోలీసులు. దీంతో ఇవాళ వైసిపి నేతలు ధర్నా చేస్తారా?  ఒకవేళ చేస్తే అరెస్టులు చేయడం గ్యారెంటీ ఆ ? అని అందరూ చర్చించుకుంటున్నారు.


ఒకవేళ ఢిల్లీలో వైసీపీ నేతలు అరెస్ట్ అయితే చంద్రబాబు ప్రభుత్వం  పనితీరుపై దేశవ్యాప్తంగా చర్చ జరిగే ఛాన్స్ ఉంటుంది. దానివల్ల వైసిపికి చాలా అడ్వాంటేజ్ కూడా జరుగుతుంది.  
కాగా చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఏపీలో విధ్వంసం కాండ జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. వరుసగా ఏపీలో వైసీపీ నేతలపై దాడులు అలాగే... ఇండ్లపై దాడులు జరుగుతున్నాయి.  ఈ తరుణంలోనే వైసీపీ నేత రషీద్ హత్య కూడా జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: