రాష్ట్ర బ‌డ్జెట్‌.. ప‌న్నుల భారం.. త‌ప్పిస్తారా? పెంచుతారా?

Veldandi Saikiran

* మద్యం ధరలు పెరిగేలా పన్నులు
* చెత్త పన్నులపై నిర్ణయం
* పెట్రోల్, డీజిల్ ధరలపై చంద్రబాబు ఫోకస్

 
కేంద్రంలో మోడీ ప్రభుత్వం బడ్జెట్ పెట్టిన నేపథ్యంలో... ఇప్పుడు అందరి దృష్టి ఏపి బడ్జెట్ పైన ఉంది. ఏపీలో.. కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఇదే.. తొలి బడ్జెట్. ఇలాంటి నేపథ్యంలో సూపర్ సిక్స్ పథకాలపై... చంద్రబాబు ప్రభుత్వం.. ఎంత మేరకు బడ్జెట్ పెడతారని అందరూ ఎదురుచూస్తున్నారు. ఎన్నికల కంటే ముందు ఇచ్చిన హామీలపై... దృష్టి పెట్టి ప్రత్యేకంగా బడ్జెట్ రూపొందిస్తారా అని ఏపీ ప్రజలు అనుకుంటున్నారు.
 

అయితే ప్రస్తుత పరిస్థితుల్లో... పూర్తిస్థాయిలో ఏపీ బడ్జెట్ పెట్టుకోలేము అని ఇప్పటికే చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అంటే ఏపీలో.. ఇవాళ ఓటాన్ అకౌంటు  బడ్జెట్ మాత్రమే ఉండబోతుందన్నమాట. ఈ ఓటర్న్ అకౌంటు బడ్జెట్... 3 నుంచి 6 నెలల వరకు మాత్రమే పని చేస్తుంది. ఇక పూర్తిస్థాయి బడ్జెట్.. వచ్చే ఫిబ్రవరిలోనే కూటమి ప్రభుత్వం పెట్టే ఛాన్సులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. శీతాకాల సమావేశాలలో భాగంగా... పెట్టబోతున్నారు.
అయితే... ఈసారి బడ్జెట్లో...పన్నుల భారం.. తగ్గించే అవకాశాలు లేదని ఆర్థిక నిప్పులు చెబుతున్నారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో..  పెట్రోల్ ,  డీజిల్ లపై అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువగా పన్నులు వసూలు చేశారని.. ఆరోపణలు ఉన్నాయి. అయితే జగన్ విధించిన పన్నునే..  ఇప్పుడు కూటమి కొనసాగించే ఛాన్సులు ఉన్నాయి. ఏపీ లోటు బడ్జెట్ లో ఉన్న నేపథ్యంలో... కూటమి ఇచ్చిన హామీలు నెరవేర్చడం చాలా కష్టం. ఇలాంటి నేపథ్యంలో పన్నుల భారం... ఏమాత్రం తగ్గబోదని సమాచారం.
 చెత్త పన్ను తొలగించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏపీలో బస్సు అలాగే లారీలపై ఉన్న పనులను తగ్గించే ఛాన్సులు ఉన్నట్లు... సమాచారం.మద్యం రేట్లు... పెరిగేలా పన్నులు విధించే ఛాన్సులు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.  ఇక మిగతా... వాటిపై.. ఉన్న పనుల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం జోక్యం చేసుకోబోదని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: