ఏపీ బడ్జెట్ 2024: కేంద్ర సాయం గోరంతే... ఖర్చేమో కొండంతా..?

FARMANULLA SHAIK
 * వేడినీళ్లకు చన్నీళ్లు తోడులా కేంద్ర సాయం!


 * రాష్ట్ర బడ్జెట్లో సగభాగం ఉచిత పధకాలే మింగేస్తున్నాయా?


 * పూర్తి స్థాయి బడ్జెట్ కత్తి మీద సాము లాంటిదే?

(అమరావతి-ఇండియాహెరాల్డ్ ): ఆంధ్రప్రదేశ్ లో ఎంతో కష్టపడి కూటమి ప్రభుత్వం అధికారాన్ని సొంతం చేసుకుంది. గెలుపే లక్ష్యంగా పెట్టుకున్న బాబు సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడంలో సక్సెస్ అయ్యారనే చెప్పాలి. అయితే రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి కారణంగా  కూటమి ప్రభుత్వానికి ప్రస్తుతం రాష్ట్ర పరిపాలన అనేది కత్తి మీద సాములా మారింది. గత ప్రభుత్వం చేసిన అప్పులు ప్రస్తుత ప్రభుత్వానికి శిరోభారంగా మారాయి.అయితే ఒకవైపు ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలు దిశగా ప్రభుత్వం ముందుకు దూసుకుపోతుంది. దాంట్లో భాగంగానే ఇప్పటికే మెగా డీయస్సీ ప్రకటించారు.అలాగే పెన్షన్ అమలు, ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ లాంటి అమలు పరిచారు. అయితే సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ప్రస్తుతం అమలు కావాల్సిన పధకాల్లో రాష్ట్ర బడ్జెట్ ను ప్రభావితం చేసే పధకాల్లో సింహాభాగంగా ఆడబిడ్డ నిధి, తల్లికి వందనం లాంటి పధకాలు ఉన్నాయి.రాష్ట్రంలో పాఠశాలలు ప్రారంభం అయి రెండు మాసాలు కావస్తున్నప్పటికి తల్లికీవందనం పధకం ఇంకా పట్టాలెక్కలేదని విపక్ష నేతలు ప్రజలకు గుర్తుచేస్తున్నారు.హామీల్లో భాగంగా తల్లికి వందనం పధకం కింద కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15 వేల రూపాయలు ఇస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే ఈ పధకాలు అమలుకోసం రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్ధిక శాఖా బడ్జెట్ కేటాయింపు చేయాలి అదే ప్రస్తుతంరాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంసం అయ్యింది.

ప్రస్తుతం రాష్ట్రంలో జులై 22 నుండి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి ఐతే ఈ సమావేశాల్లో పూర్తి బడ్జెట్ అనేది ప్రభుత్వం ప్రవేశ పెట్టకుండా ఓటాన్ బడ్జెట్ వైవు మొగ్గు చూపింది దానికి కారణం రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి అని తేల్చింది మరో రెండు నెలల్లో పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది.అయితే రాష్ట్ర ఆర్ధికస్థితి పరంగా కొంతలోకొంత కేంద్ర బడ్జెట్ ఊరట నిచ్చిందనే చెప్పాలి. కేంద్రంలో అధికారప్రభుత్వం ఏర్పడటానికి కారణమైన సంకీర్ణ ప్రభుత్వాలు ఏపీలో కూటమి అలాగే బీహార్లో జేడీయూకు నిన్న జరిగిన పార్లమెంట్ బడ్జెట్ లో వరాల వర్షం కురిపించిన సంగతి తెల్సిందే. ఇరు రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వనప్పటికి ప్రత్యేక నిధులు కేటాయింపుపై రెండు రాష్ట్ర ప్రభుత్వాలు హర్షం వ్యక్తం చేసాయి.

అయితే ఏపీ విషయంలో మాత్రం కేంద్ర ప్రభుత్వం అమరావతి అభివృద్ధి కోసం 15వేల కోట్లు అలాగే పోలవరం పూర్తి స్థాయి నిర్మాణానికి భరోసా ఇచ్చినప్పటికి రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దృష్ట్యా తక్కువే అని చెప్పాలి.ప్రస్తుతం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న ఓటాన్ బడ్జెట్లో తల్లికి వందనం పధకం అమలుకోసం సింహాభాగాన్ని బడ్జెట్ కేటాయింపు చేసే చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. అదేకనుక జరిగితే భారీ మొత్తంలో హామీల్లో భాగంగా ఆ పధకానికి కేటాయింపులు చేయాల్సిందే.అలాగే మహిళలందరిని అట్ట్రాక్ట్ చేసిన పధకాల్లో ఒకటైన ఆడబిడ్డ నిధి అమలుకూడా ఒక పెద్ద పరీక్ష లాగా మారింది కూటమి ప్రభుత్వానికి. ఆ పధకంలో భాగంగా ఎంత మంది మహిళలుంటే అంతమందికి 1500 ప్రతి నెల రాష్ట్ర బడ్జెట్ లో కేటాయింపు చేయాల్సిందే.అంటే రాష్ట్ర బడ్జెట్ లో అధికమొత్తం సూపర్ సిక్స్ పధకాలకే కేటాయించాల్సి వస్తుంది. మరో వైపు రాష్ట్ర అభివృద్ధి పరంగా ఆంధ్రప్రజల జీవనాడి అయినా పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అనేది కచ్చితంగా చేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తుంది. ఏదేమైనా మరో రెండు నెలల్లో రాష్ట్రప్రజల అవసరాలను బట్టి ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెడుతుందని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: