వేతన జీవులకు ఊపిరి పోసేలా కేంద్ర బడ్జెట్.. స్టాండర్డ్ డిడక్షన్ భారీగా పెంపు!

Veldandi Saikiran
పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్...కీలక నిర్ణయాలను ప్రకటించారు. ముఖ్యంగా వేతన జీవులకు ఊపిరి పోసేలా కేంద్ర బడ్జెట్ ను ప్రకటించారు. స్టాండర్డ్ డిడక్షన్ భారీగా పెంచుతున్నట్లు వెల్లడించారు. స్టాండర్డ్ డిడక్షన్ 50,000 రూపాయల నుంచి 75,000 రూపాయలకు పెంచారు కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్. ప్రస్తుతం ఇది రూ. 50 వేలుగా ఉండగా లక్ష రూపాయలకు పెంచాలని కోరుకున్నారు ఉద్యోగులు. స్టాండర్డ్ డిడక్షన్ తో ఎలాంటి ఆధారాలు సమర్పించకున్నా పన్ను తగ్గించుకునే ఛాన్స్ ఉంటుంది. 2018 సంవత్సరంలో రూ.40 వేలుగా స్టాండర్డ్ డిడక్షన్ ఉంది. 2020 సంవత్సరం ఏప్రిల్ 1న 50 వేలకు పెంచింది మోదీ సర్కార్.

అంతేకాకుండా ఆంధ్ర ప్రదేశ్‌ కు, బీహార్‌కు కేంద్రం ఆర్ధిక సాయం భారీగా చేసింది. రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటన చేశారు. బీహార్‌లో జాతీయ రహదారులకు రూ.20 వేల కోట్లు ఇస్తున్నాట్లు చెప్పారు.. వరద నివారణకు, సాగు కార్యక్రమాలకు రూ.11 వేల కోట్లు కేటాయింపులు చేస్తున్నట్లు వివరించారు కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్. బహుపాక్షిక అభివృద్ది ఏజెన్సీల నిధుల ద్వారా బీహార్‌కు ఆర్ధిక సాయం చేస్తుట్లు వివరించారు.

అంతేకాకుండా... కొత్త పన్ను విధానంలో కీలక మార్పులు చేసినట్టు ప్రకటించారు నిర్మలమ్మ. 3 లక్షల రూపాయల లోపు ఆదాయం ఉన్నవాళ్లకు సున్నా పన్ను కేటాయించినట్లు ప్రకటన చేశారు. 3 లక్షల నుంచి 7 లక్షల వరకు ఆదాయం ఉన్నవాళ్లకు 5 శాతం పన్ను ఉంటుందని వెల్లడించారు కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్.7 నుంచి 10 లక్షల మధ్య ఆదాయం ఉన్నవాళ్లకు 10 శాతం పన్ను అమలు చేయబోతున్నట్లు తెలిపారు. ఇక 10 నుంచి 12 లక్షల మధ్య ఆదాయం ఉన్నవాళ్లకు 15 శాతం పన్ను ఉంటుందని వెల్లడించారు కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్. అటు 12 నుంచి 15 లక్షల మధ్య ఆదాయం ఉంటే 20 శాతం పన్ను...  15 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉంటే 30 శాతం పన్ను అమలు చేస్తామన్నారు కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: