టీడీపీ: రోజాలా మారుతున్న మరో ఏపీ మంత్రి?

Veldandi Saikiran
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో..చాలామంది ఫైర్ బ్రాండ్ నేతలు ఉన్నారు. అందులో రోజా ఒకరు. వైసిపి పార్టీ తరఫున.. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రోజా... ఒకసారి మంత్రిగా కూడా పని చేశారు. అయితే ఆమె నిత్యం... తెలుగుదేశం పార్టీని అలాగే పవన్ కళ్యాణ్ ను తిడుతూ ఉంటారు. పచ్చి బూతులతో రెచ్చిపోతూ ఉంటారు. దీంతో రోజా.. బూతుల నాయకుల్లో చేరిపోయారు. అయితే ఆమె దూకుడుకు.. మొన్నటి ఎన్నికల్లో నగరి ప్రజలు కళ్లెం వేశారు. ఇక ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా రోజా తరహాలో మరో మంత్రి తెరపైకి వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.

ఆమె ఎవరో కాదు...మంత్రి గుమ్మడి సంధ్యారాణి. జగన్ రెడ్డి మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని...దెబ్బలు, కోట్లాటలకు వైసీపీ నేతలే ఆద్యులు అంటూ నిన్న రెచ్చిపోయారు మంత్రి గుమ్మడి సంధ్యారాణి. అచ్చం రోజా రేంజ్‌ లోనే... మంత్రి గుమ్మడి సంధ్యారాణి వివాదస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు.  తాజాగా మీడియాతో మంత్రి గుమ్మడి సంధ్యారాణి మాట్లాడుతూ...నేడు ప్రాజాస్వామ్యం గురించి వైసీపీ నేతలు మాట్లాడుతుంటే నవ్వు వస్తోందని చురకలు అంటించారు. అబద్దాలు ఆడటం వైసీపీ నేతలకు వెన్నతో పెట్టిన విద్య అన్నారు.

దమ్ముంటే జగన్ రెడ్డి వాళ్ల బాబాయి హత్యపై ఢిల్లీలో ధర్నాచేయాలని డిమాండ్‌ చేశారు. చిన్నపిల్లలకు చాక్లెట్ ఇస్తే బయటకు వచ్చినట్లు.. జగన్ రెడ్డికి శవం కనిపిస్తే బయటకు వస్తున్నాడన్నారు మంత్రి గుమ్మడి సంధ్యారాణి. నిజంగా ప్రజాస్వామ్యం కోరే నాయకులు అయితే వివేకా హత్యపై సీబీఐ ఎంక్వైరీ కోరాలని చురకలు అంటించారు. డ్రైవర్ ను చంపి డోర్ డెలివరి చేసిన వ్యక్తి కూడా ప్లకార్డులు పట్టుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనడం సిగ్గుచేటు అంటూ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఫైర్‌ అయ్యారు.

కక్ష పూరితంగా వెళ్లాలంటే మా నాయకుడు కనుసైగ చేస్తే చాలు అని తెలిపారు. వైసీపీ నేతల చేతిలో ఇబ్బంది పడిన మా కార్యకర్తలే వారికి బుద్ధి చెబుతారన్నారు. కాని మా నాయకుడు మాకు క్రమశిక్షణ నేర్పించారు. అందుకే చట్ట ప్రకారం వెళ్తున్నామని వివరించారు. వైసీపీ నేతలు కవాలనే కవ్వింపు చర్యలకు దిగుతున్నారని... టీడీపీ నేతలు సహనంతో ఉండాలి... సమస్యలు ఉంటే టీడీపీ కార్యాలయం వద్దకు వచ్చి తెలియజేయాలని పేర్కొన్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి నిత్యం అందుబాటులో ఉంటాం... వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు మంత్రి గుమ్మడి సంధ్యారాణి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: