బీహార్ vs ఏపీ.. ట్రీట్మెంట్ సేమ్ అంటున్న మోదీ...?

FARMANULLA SHAIK
* బీహార్ రాష్ట్ర ఆశలపై నీళ్లు చల్లిన కేంద్రం.!
* మోదీ డెసిషన్ తో బాబు ఆలోచన మరేనా.?
* స్పెషల్ ప్యాకేజీ అయినా బాబుకు అందేనా..?
( ఢిల్లీ-ఇండియాహెరాల్డ్ ) : సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం కేంద్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడిన సంగతి తెల్సిందే.దాంతో మోదీ ముచ్చటగా మూడోసారి పీఎం అయ్యారు.ఐతే మోదీ ఈసారి పీఎం అవ్వడానికి కావలసిన మెజారిటీ అనేది పార్లమెంట్లో రాలేదు.దాంతో నార్త్ లో బీహార్ నుండి జేడీయూ, ఏపీలో టీడీపీ కూటమి మోదీకు మద్దతు ఇవ్వడంతో ఆయన మూడోసారి పీఎం అయ్యారు.జేడీయూ అనేది 12 మంది ఎంపీలతో కూటమిలో మూడో అతిపెద్ద పార్టీగా ఉంది. దీంతో జేడీయూ అధినేత, బీహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. ఈ డీల్‌తోనే ఎన్డీయే కూటమిలో జేడీయూ భాగమైందంటూ రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరిగింది. ప్రత్యేక హోదా లేని పక్షంలో ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్ చేసింది.

ప్రత్యేక హోదాపై ఎన్నో ఆశలు పెట్టుకున్న బీహార్ రాష్ట్రానికి కేంద్రం షాక్ ఇచ్చింది.ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తప్పక వస్తుందని అందరూ భావించినప్పకీ నేటి పార్లమెంట్ సమావేశంలో బీహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని కేంద్ర ఆర్థిక శాఖ తేల్చిచెప్పింది. బీహార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడానికి జాతీయ అభివృద్ది మండలి ఐదు నిబంధనలు పెట్టిందని ఆ నిబంధనల ప్రకారం ప్రత్యేక హోదా ప్రకారం సాధ్యం కాదని ఆర్థిక శాఖ చెప్పుకొచ్చింది. ఎన్‌డీసీ నిబంధనల ప్రకారం గతంలో కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేకహోదాను కల్పించినట్లు కేంద్రం పేర్కొంది.ప్రత్యేక హోదా అనేది వెనుకబడిన రాష్ట్రాల అభివృద్ధికి దోహదపడుతుంది. కేంద్ర మద్దతుతో ఈ హోదా లభిస్తోంది. రాజ్యాంగ ప్రకారం ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేకపోయినప్పటికీ 1969లో ఐదోవ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు కొన్ని రాష్ట్రాలకు స్పెషల్ స్టేటస్ ఇచ్చారు. ఇప్పటివరకు ప్రత్యేక హోదా పొందిన రాష్ట్రాల్లో జమ్మూ కాశ్మీర్,హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ఉన్నాయి.ఇకపోతే ఏపీ విషయానికి వస్తే ప్రస్తుతం ఈ రాష్ట్రంలో కూడా ప్రత్యేక హోదా అంశం అనేది మళ్లీ తెర పైకి వచ్చింది.ఢిల్లీ వేదికగా టీడీపీ, వైసీపీ మధ్య స్పెషల్‌ స్టేటస్‌ ఫైట్‌ నడుస్తోంది. ఎన్డీయే కూటమిలో ఉన్న టీడీపీ ప్రత్యేక హోదాపై మాట్లడడం లేదని వైసీపీ ఆరోపిస్తోంది. అయితే తమ ముందు చాలా అంశాలు ఉన్నాయని వాటన్నింటిపైనా పార్లమెంట్‌లో మాట్లాడతామంటూ టీడీపీ కౌంటర్‌ ఇవ్వడం కాకరేపుతోంది.
నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ సూచించిన కొన్ని అర్హతలు ఉన్న రాష్ట్రాలకే ప్రత్యేక హోదా ఇస్తారని తేల్చి చెప్పేసింది.తాజాగా బిహార్‌కు ఈ అర్హతల్లేవని కేంద్రం స్పష్టం చేసింది.దాంతో ఆంధ్రప్రదేశ్‌కు కూడా హోదా ఇచ్చే అవకాశం లేనట్లు స్పష్టం అయినట్లు తెలుస్తుంది.అయితే మోదీ కూటమిలో కీలకంగా వ్యవహించిన సీఎం చంద్రబాబుకు కూడా మోదీ షాక్ ఇచినట్లే అని రాజకీయా విశ్లేషకులు అంటున్నారు.అయితే చంద్రబాబు ప్రత్యేక హోదా కోసం కాకపోయినా కనీసం ప్రత్యేక ప్యాకేజ్ రాష్ట్రానికి కావాలంటూ కేంద్రం వద్ద ప్రస్తావించబోటున్నట్లు సమాచారం.మరీ దీనిపై మోదీ స్పందన ఎలా ఉంటుందో చూడాలి మరీ. ప్రస్తుతం రాష్ట్ర పరిస్థితి ఆర్ధికంగా దారుణమైన స్థితిలో ఉంది. గత ప్రభుత్వం చేసిన తప్పుల వల్ల కోలుకోలేని విధంగా ఉన్న రాష్ట్రానికి కేంద్రం సహాయం అనేది చాలా అవసరం కాబట్టి మోదీను రిక్వెస్ట్ చేసుకోక తప్పదు చంద్రబాబుకు. అయితే దానిపై మోదీ ఆలోచన ఏంటో చూడాలి మరీ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: