ఫ్యూచర్ ప్లాన్ దిశగా మంత్రులకు,ఎమ్మెల్యేలకు ఆదేశాలు జారీ చేసిన బాబు..!

FARMANULLA SHAIK
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరడంతో సీఎం చంద్రబాబు పాలనాపరమైన వ్యవహారాల పై పూర్తిగా ఫోకస్ పెట్టారు.సీఎంగా చంద్రబాబు దూకుడు గా ముందకు సాగుతున్నారు. రాష్ట్రాన్ని తిరిగి ట్రాక్‌ లో పెట్టేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. మరోవైపు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో కూడా ముందు ఉంటున్నారు.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రులు, ఎమ్మెల్యేల పై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ మేరకు ప్రతి నెలా ఒకటో తేదీనా పింఛన్ల పంపీణీ చేపట్టాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా ఎమ్మెల్యేలు, మంత్రులు తమ తమ నియోజకవర్గా్ల్లో పింఛన్ పంపిణీ కార్యక్రమాల్లో విధిగా పాల్గొనాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. పాలనా పరమైన పనులు ఉన్నా.. వాటన్నింటిని పక్కన పెట్టి పింఛన్ పంపిణీలో పాల్గొనాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో విజయబావుటా ఎగురవేసేందుకు ఇప్పటి నుంచి ప్రజలతో మమేకమే సేవలందించాలని సూచించారు. పార్టీకి, ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య అనుసంధానం ఉండేలా పని చేయాలన్నారు. ఆయా జిల్లాల్లో ఉన్న పార్టీ కార్యాలయాలను నెలకు ఒక్కసారైనా.. విధిగా సందర్శించాలని సీఎం చంద్రబాబు తెలిపారు.ప్రతి మంత్రి, ఎంపీ వారంలో ఒక రోజు పార్టీ కార్యాలయానికి వెళ్లాలని సూచించారు. ప్రజలు, కార్యకర్తల నుంచి వినతులు తీసుకుని సత్వర పరిష్కారానికి చర్యలు చేపట్టాలని అన్నారు. మంత్రులు జిల్లాలకు వెళ్లినప్పుడూ విధిగా పార్టీ కార్యాలయాలను సందర్శించాలని చెప్పారు. ఎన్డీయే నేతలతో సమావేశమవ్వాలని కోరారు. కార్యకర్తలకు అండగా నిలబడాలని.. వారికి తగిన సాయం చేయాలి అని పేర్కొన్నారు.జూన్ 22వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఐదు రోజుల పాటు ఈ సారి సమావేశాలు నిర్వహించనున్నారు. మొదటి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగం ఉంటుంది. రెండో రోజు గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం ఉంటుంది. ఆ తర్వాత తాత్కాలిక బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: